ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మిత్రవింద.(బేతాళకథ) -- డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై --పట్టువదలని విక్రమార్కుడు మరలా చెట్టు వద్దకు వచ్చి శవాన్ని ఆవహించిఉన్నబేతాళుని బంధించి భుజంపై వేసుకుని మౌనంగి నడక సాగించసాగాడు.శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుడు'విక్ర మార్కమహిపాలా నీ కార్యదీక్షిత,పట్టుదల అమోఘం,దుర్గ,రంభ,బ్రహ్మ,భృంగి,శివుడు,శుక్రుడు,వాయువు,కశ్యపుడు ,రావణుడు ,కోలాహలుడు,నారదుడు, దత్తిలుడు,వసిష్ఠుడు,చవ్యనుడు,గౌతముడు,బృహస్పతి,అర్జునుడు,భరతముని, షణ్ముఖుడు,మతంగుడు ,భరద్వాజుడు, ఆదిశేషుడు, శార్ణదేవుడు, తుంబురుడు,నందీశ్వరుడు,వినాయకుడు,సోమనాధుడు,భోజమహీపతి,ఆంజినేయుడు, అభినవగుప్తుడు,మాతృగుప్తుడు,యాజ్ఞవల్కుడు వంటి సంగీత గాన ప్రకాశకుల సరసన నిలువ గలాగిన వారని నాకు తెలుసు. నాకు చాలాకాలంగా ఉన్న సందేహన్ని నీకు మిత్రవింద అనే కథా రూపంలో వినిపిస్తాను.....పూర్వం అమరావతి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలి స్తున్నాడు.అతనికి వివాహ వయసుఉన్న మిత్రవింద అనే రూప,విజ్ఞాన,వినయ సంపన్నమైన, కుమార్తె కలదు.ఆమెను వివాహం చేసుకోవడానికి,మంత్రి కుమారుడైన పుండరీకుడు, సేనాపతి కుమారుడైన వీరవర్మ,కోశాధిపతి కుమారుడైన ధనపాలుడు ముగ్గురు పోటి పడసాగారు.వారు ముగ్గురు కూడా వివేకవంతులు, అందమైనవారు మరియు పరాక్రమ వంతులు,ముగ్గురు మహరాజును కలసి తమ కోరికను వెల్లడించగా,'మీలో ఎవరు మహత్తుగల విద్య ఆరునెలలో పూర్తిచేసుకు వస్తారో వారికి మిత్రవిందను ఇచ్చి వివాహం జరిపిస్తాను' అని రాజ సభలో అందరిముందు ప్రకటించాడు.ముగ్గురు యువకులు మూడు దార్లులలో విడిపోతూ 'వచ్చే ఏరువాక పౌర్లమినాడు ఇక్కడే కలుసుకుందాం'అని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.అలావిడి పోయిన వారు ఆరు నెలల అనంతరం మూడు దార్లు కలిసే ప్రదేశంలో ఏరువాక పౌర్టమి నాడు కలుసుకున్నారు. 'సోదరులారా మిత్రవింద ఈసమయంలో ఏమిచేస్తుందో చూడాలనిఉంది' అని మనసులోని కోరిక విన్నవించాడు పుండరీకుడు. వెంటనే ధనపాలుడు 'రాజకుమార్తెను నేను చూపించగలను'అని తను సంపాదించిన మాయ అద్దంలో చూపించాడు.అందులో...ఉద్యానవనం విహరిస్తూ పాము కాటుకు లోనై మరణిస్తున్న మిత్రవింద కనిపించింది. 'మనం వెంటనే అమరావతి రాజ్యం చెరే మాయవస్త్రం నావద్దఉంది'అని నేలపై దాన్ని పరచాడు వీరవర్మ. అలాముగ్గురు మాయ వస్త్రం పైనకూర్చోని ఆకాశ మార్గాన క్షణాలలో అమరావతి రాజ్య ఉద్యానవనం చేరారు. ఆలస్యంచేయ కుండా,తనవద్దనున్న దివ్యసంజీవిని తో మిత్రవిందను బ్రతికించాడు పుండరీకుడు.'విక్రమార్క మహరాజా మిత్రవింద కథ విన్నావుగా,వారు ముగ్గురు మహిమ గల వస్తువులే సంపాదించినవారే వారిలో మిత్రవిందను వివాహం చేసుకునే అర్హత ఎవరికిఉంది.తెలిసిచెప్పకపోయావో నీతలపగిలి మరణిస్తావు'అన్నాడు బేతాళుడు.బేతాళ నువ్వు చెప్పినట్లు ముగ్గురూ మహిమాన్విత వస్తువులు సంపాదించినవారే,అయినప్పటికి ప్రాణదానం చేసిన పుండరీకుడే మిత్రవిందను వివాహంచేసుకొనే అర్హత కలిగినవాడు' అన్నాడు విక్రమార్కుడు.విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహ మాయమయ్యాడు బేతాళుడు. పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళుని కొరకు వెనుతిరిగాడు.
July 28, 2020 • T. VEDANTA SURY • Story