ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మిత్రులందరికీ శుభోదయం......ఈ రోజు మనం తెలుగు పండుగలు వాటి వలన మనం తెలుసుకోవలసిన విషయాలు గురించి అవగాహన కల్పించు కుందాం. మన పండుగల గొప్పతనం--*ఉగాది:*- కష్టము,సుఖము,సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని. *శ్రీరామ నవమి*:- భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.*అక్షయ తృతీయ*:- విలువైన వాటిని కూడబెట్టుకోమని. *వ్యాస (గురు)పౌర్ణమి* :- జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.*వరలక్ష్మి వ్రతం* :- నీకున్న ఐశ్వర్యమును అందరికి పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.*రాఖీ పౌర్ణమి*:- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.*వినాయక చవితి* ( నవరాత్రులు ) :- ఊరంతా ఒక్కటిగా కలవడానికి.*పితృ అమావాస్య* :- చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.*బతుకమ్మ*:- ఊళ్లోని వాళ్లంతా ఆట పాటలతో కలిసిపోతూ సంతోషంగా గడపమని.*దసరా ( ఆయుధ పూజ)* :- ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.*దీపావళి* :- పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.*నాగుల చవితి*;- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.*కార్తీక పౌర్ణమి* :- చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమ నెడి.*సంక్రాంతి*:- మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.*మహా శివరాత్రి* :- కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.*కామదహనం*:- కోరికలు తగ్గించమని. *హోళీ* :- వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు ,వివిధ అనుభూతులను పిల్లా పెద్ధ అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని మన పండుగల అంతరార్దం--మణిదీప్ రెడ్డిఇంటర్ రెండవ సంవత్సరంప్రభుత్వ జూనియర్ కళాశాలబాదేపల్లి
August 14, 2020 • T. VEDANTA SURY • News