ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మిత్రులందరికీ శ్రావణ,రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు.పీవీనరసింహారావుగారి శతజయంతి పురస్కరించుకుని పీవీసాహిత్యపీఠం,కరీంనగర్ శతజయంతి నిర్వహణ కోర్ కమిటీ నిర్వహించిన కవితలు ,పద్యాలు ,స్నేహపూర్వక పోటీకి విశేష స్పందనలభించింది.ఉభయ తెలుగురాష్ట్రాలనుంచి ,ముంబాయినుంచి పీవీ అభిమానులు అత్యంత ఉత్సాహంగాపాల్గొన్నారు.వందకుపైగా వచ్చినవాటిలోనుండి మూడు బహుమతులు నిర్ణయంచేయడం కష్టం.అందుకని వాటి సంఖ్య పదికి పెంచాము.ప్రథమ 1 ద్వితీయ 2 తృతీయ 3 ప్రోత్సాహం 4 .ఐనా ఇది రచయితల ప్రతిభకు కొలమానం కాదు.అందరికీ అక్షర లక్షలుఇవ్వాలి.అది అసాధ్యం.రచయితలందరికీ కృతజ్ఞతలు.వారి ప్రతిభ, పీవీ గారి పట్ల అభమానం మాటలకు ,ధనం మూటలకు అందనిది.న్యాయనిర్ణేతల ఫలితాలు రావడం ,ప్రస్తుతపరిస్థితుల్లో ఆలస్యం కావచ్చు.పాల్గొన్న వారందరికీ పీవీగారి కుమారుడు శ్రీ పీవీ ప్రభాకర రావు గారు, కుమార్తె శ్రీమతి సురభి వాణీ దేవి గారు సంతకంచేసిన ప్రశంసాపత్రాలు,ముద్రించబడిన కవితా సంకలనం రెండు ప్రతులు కలిపి అక్టోబరుమాసంలో పంపబడును.కావున పాల్గొన్న పెద్దలంతా సహకరించాలి.బహుమతులు పొందినవారికి సమాచారం పదిహేనురోజులతర్వాత నేరుగాతెలుపుతూ,నగదు వారి ఖాతాలో జమచేయబడును.దరచేసి ఉత్తర ప్రత్యుత్తరాలు చేయకండి అని మనవి.-సంతోష్ బాబు కల్వకోట
August 3, 2020 • T. VEDANTA SURY • News