ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మీకు తెలుసా...:--మొహమ్మద్. అఫ్సర వలీషా-ద్వారపూడి (తూ గో జి).
November 13, 2020 • T. VEDANTA SURY • Poem


బాలలూ.....

మీ కనులకు కల

మీ నడకకు దారి

మీ ఆలోచనలకు ఆకారం

మీ ఊహలకు ధైర్యం

మీ మాటలకు ప్రాకారం

మీ చూపులకు వెలుగు

మీ కలలకు అర్ధం

మీ గుండె కు చప్పుడు 

మీ భావాలకు భాష

మీ ఆశలకు శ్వాస

మీ హాహ భావాలకు స్ఫూర్తి

మీ నిత్య ప్రేమ అమృత ధారలు

మీ ప్రాణానికి ప్రాణాలు 

మీకు జన్మ నిచ్చిన మీ 
అమ్మా నాన్నలు....

వారిని నిత్యం ప్రేమించండి
గౌరవించండి....!!