ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ముంచుకొచ్చే ముప్పు --కళావతి కందగట్ల -హైదరాబాద్ -9948263004
October 5, 2020 • T. VEDANTA SURY • Poem

 ఉరుకుల పరుగుల జీవితం
 సమయపాలన లేని బ్రతుకులు
 కంటినిండా నిద్ర కరువు
 కడుపునిండా తిండి కరువు

అనారోగ్య సమస్యల 
పలకరింపులకు.. 
అవసరానికి మించి   
ఔషధాల వాడకం 
ముంచుకొచ్చే ముప్పు 
కనిపెట్టలేని పరిస్థితి.... 

విషతుల్యమైన శరీరం
మన  అదుపాజ్ఞల నుండి  
చేజారి... మందులు చేసే 
చర్యలు ప్రతి చర్యలకు  
కొత్త రోగాలు పుట్టుకొచ్చి 
ఉసురో మంటుంది ప్రాణం 

 వంటింటి వైద్యానికి
 పెద్ద పీట వేస్తూ... 
 వ్యాయామానికి సమయం
 కేటాయిస్తూ... 
 ఆరోగ్యకరమైన     ఆహారపుఅలవాట్లు 
అలవర్చుకుంటే 
ఔషదాలతో  పని ఏమి 
మనిషికి......