ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ముత్యం-- లెబనాన్ కవి తాత్వికుడు ఖలీల్ జిబ్రాన్ చెప్పిన కథలలో ఇదొకటి....ఓరోజు ఓ అల్చిప్ప మరొక అల్చిప్పతో "చాలా నొప్పిగా ఉంది. భరించలేని బాధ" అని కంట తడిపెట్టింది. రెండో అల్చిప్ప అడిగింది "ఏమైంది...అంతలా బాధపడుతున్నావు?" అని అడిగింది. "ఏమిటో తెలీడంలేదు. నొలో ఏదో ఒకటి అటూ ఇటూ పొర్లుతోంది. అది కదులుతున్నప్పుడల్లా తట్టుకోలేని బాధ" అని మొదటి అల్చిప్ప చెప్పింది.రెండో అల్చిప్ప చెప్పింది...."అమ్మయ్య నాకిలాటి నొప్పులివ్వని దేవుడికి కృతజ్ఞతలు. నాకెలాంటి నొప్పులూ లేవు. హాయిగా స్వేచ్ఛగా ఉన్నాను. నాలో ఏ తేడా లేదు" అంటూ గలగలా నవ్వింది.అల్చిప్పల మధ్య జరిగిన సంభాషణను విన్న ఓ ఎండ్రకాయ రెండో ముత్యంతో "నువ్వేంటో ఏ నొప్పులూ లేవని ఖుషీగా ఉన్నావు. బాధను తట్టుకోడానికి సిద్ధంగా లేని నువ్వు జీవితాంతమూ వ్యర్థంగానే ఉంటావు. నువ్వెవరికీ అక్కర్లేదు. నిన్నెవరూ ఇష్టపడరు. కానీ యమబాధ అనుభవిస్తున్న మొదటి అల్చిప్ప త్వరలోనే ఆణిముత్యంలాంటి ఓ ముత్యానికి రూపమిచ్చి ఎంతో విలువైనదిగా నలుగురినోటా అన్పించుకుంటుంది. ఆరోజు నువ్వెందుకూ పనికిరాకుండాపోయానే అని నిన్ను నువ్వు నొచ్చుకుంటావు" అన్నాది.కష్టించకుండా కష్టపడకుండా ఏ ప్రతిఫలమూ దక్కదనడానికి ఇదొక ఉదాహరణ.- యామిజాల జగదీశ్
June 25, 2020 • T. VEDANTA SURY • Story