ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ముత్యాల జల్లులల్లో రతనాల వాకిల్లో నేనాడి పాడనా నేగంతేసి ఎగిరి ఊరేగెనా. చల్లని గాలి అలలకే ఊయలై ఊగిపోయే సంబరాల జల్లులతో సైయాటలే సోకుగానాడనా. మెరుపులై రాలి పడే ముత్యాల జల్లులనే దోసిల్ల దొరపుచ్చుకొని కొంగుముడిలోనా నే దాచుకొని ఆడుకోనా. నెమలిలా నాట్యమాడీ పూలవాన వలపులలో నా ప్రేమ కథలన్నో నే మనసార వినిపించనా కరోనానే తరిమేయమంటూ చటపటా చినుకులనే హేచ్చరికలు చేస్తూ. సరిగంగ స్నానమే చేయుచూ ఆటాడుకోనా నీటి బుడ గల నేనెగిరి కాలమే మరచీపోయి అలసటలే వచ్చేవరకూ కేరింతలే కొట్టినేనాడుతు హాయిగా నేవానలో ఆడనా -జయంత్ నమిలకొండ
August 20, 2020 • T. VEDANTA SURY • Poem