ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ముప్పై ఏళ్ల కిందటి ఈ జ్ఞాపకాన్ని బాల్యమిత్రుడు గుమ్మడి వేణుగోపాల్ మా హైస్కూల్ మిత్రుల వాట్సాప్ సమూహంలో ఈరోజు షేర్ చేశాడు. అప్పట్లో (1989-90) 'సాహితి' అనే పేరుతో మేము రూపొందించిన లిఖిత త్రైమాసిక పత్రిక ప్రతి ఇది. ఈ కవర్ పేజీపై, విషయ సూచికలో ఉన్న రాత నాదే. ఇలా చేతి రాతతోనే ఐదారు కాపీలు బయటికి తెచ్చేవాళ్లం.ఇక్కడ షేర్ చేస్తున్న ఈ ప్రతి మూడవ సంచిక. ఈ సంచిక కోసం నేను ఒక కథ, ఒక కవిత రాశాను. వాటితో పాటు 'మీ సాహితీ పరిజ్ఞానం ఎంత?' అనే రెగ్యులర్ ఫీచర్ ను కూడా నేనే నిర్వహించాను. ఈ సంచిక కోసం డా.జె.చెన్నయ్య గారు శ్రీశ్రీపై ఒక వ్యాసాన్ని అందించారు. గుమ్మడి వేణుగోపాల్, కోటం చంద్రశేఖర్, ముళ్ళపూడి శర్మ, మధూ దేశ్ పాండే, సత్యవతి, ఎం.కె.బషీరుద్దీన్ తదితరుల రచనలు ఇందులో ఉన్నాయి. ప్రముఖ కవులు డా.అమ్మంగి వేణుగోపాల్ గారు, డా. ఇరివెంటి వెంకటరమణ (హిమజ్వాల) గారు ఈ సంచికలు వెలువడడానికి చోదకశక్తిగా నిలిచారు. - డాక్టర్ . సూర్య ప్రకాష్ రావు
June 29, 2020 • T. VEDANTA SURY • Memories