ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మైమరపు.....:--మొహమ్మద్ అఫ్సర వలీషా-- ద్వారపూడి (తూ గో జి)
November 21, 2020 • T. VEDANTA SURY • Poem

మనసులను 
మరపిస్తుంది.....

మనుషులను
మైమరపిస్తుంది......
 
కలల అలలలో
తేలియాడిస్తుంది....

మబ్బు తెరల 
మాటునుండి
ఒయాసిస్సును 
తలపిస్తుంది....

ఆకాశానికి నిచ్చెన
వేయగల్గుతుంది.....

అందరినీ సీతాకోకచిలుకలా
ఆకర్షించ గల్గుతుంది....

అవలీలగా మైకపు 
తెరలను కమ్మేస్తుంది.....

కోటి ఆశల కుంపట్లు
వెలిగిస్తుంది....

అవనిలో హరివిల్లు 
అందాలు చూపిస్తుంది....

సప్త సముద్రాలు దాటుతున్న
అనుభూతి కలిగిస్తుంది....

నింగిలో మెరుపు 
తీగలను సృష్టిస్తుంది....

మనిషి మనసు నెరగాలి
మనసు దిటవు చేయాలి...

ముఖస్తుతి  మాయా 
జాలానికి తెరతీయాలి .....!!