ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మొదలుపెట్టడం--కె ఎస్ అనంతాచార్య-- ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఓం పృథివ్యాహ అంటేనే కర్మ చక్రం కదులుతుంది కొనసాగించేవాళ్ళు కోటిమంది ప్రారంభం పది మందితోనే అనుభవంలోకి వచ్చిన ఆచరణయే వేల మైళ్ళు ప్రయాణిస్తుoది ఒంటరి తనంలో పుట్టిన ఒక భావన నిస్సహాయతకు తోడై నీడలా నిల్వడo కొరకే రెక్కలాడటం కాళ్ళు కదలడం కాదు మనసును మడిచి కార్యావాహ కావడమే ఇంగితాలు పలుకని శిశువేలా మాట్లాడుతుoది మోకాళ్ళు దెబ్బలు తింటేనే నడక నల్లేరుపై కొనసాగుతుంది ఆరంభించటం ఆలోచనలకు రూపం పోసి ఆరాధించడం మొదలు పెట్టడం అంటే దీక్షగా పరీక్షలు దాటుకుంటూ పది తలల అసురుని రాక్షసత్వాన్ని హతమార్చడమే
August 5, 2020 • T. VEDANTA SURY • Poem