ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మొబైల్ మోరల్స్ ..: ---కె.ఎల్వీ
November 6, 2020 • T. VEDANTA SURY • Poem

కూసుడూ ...
రాసుడూ ...
ఎక్కువయ్యాక ,
సమయమంతా  ,
సెల్ఫోన్ తోనె _
గడపడం ,
మొదలయింది.!

బాగా దగ్గరయ్యానో,
నిత్య జీవితంలో,
అదీ ..ఒక భాగం ,
అనుకున్నానో గానీ..
దానికి ...
బానిసనయ్యానని ,
మా ..ఇంట్లో వాళ్లు ,
బ్రాన్డ్ చేసేసారు నన్ను !

ఏమీ తోచనప్పుడు ,
ఏమిచేస్తాం ?
పుస్తకాలు మాత్రం ,
ఎంతసేపు చదువుతాం ?
చూపు తక్షణం ,
మొబైల్ ఫోనుమీద ..
పడుతుంది !

ఏదో ..పనిమీద 
నా ..శ్రీమతి ,
నాముందునుండే ,
నన్ను చూసుకుంటూ ,
పొతుంది ....!
ఆమెలో_
కోపం కోడె త్రాసులా ,
బుసకొడుతుంది ..కానీ ,
ఏమీ అనలేకపోతుంది !

మరో  రౌండ్లో ...
నాచేతిలో _
సెల్ ఫోన్ చూసీ ,
ఏమాత్రం ,
ఆపుకోలేక ,
" ఆ..న్యూస్ పేపర్_
చదూకోవచ్చుగా"
అంటుంది మెల్లగా ,
చదివేసినట్టు 
తల ఊపుతానా ...
ఏంచెప్పాలో తెలీక ,
వెనక్కి మళ్లిపోతుంది !

మళ్ళి వస్తుంది ,
ఓసారి ...
" స్నానం చేసేయరాదా ?"
అంటుంది ...
ఆమె ముఖంలోకి 
సూటిగా చూస్తానా ...
తల దించుకుని ,
నిష్క్రమిస్తుంది _
అక్కడినుంచి !

అప్పుడిక ..
నాలో ..నేనే _
మదన పడిపోతుంటాను,
నాగురించి ..
ఆమేమనసులోని వ్యథను 
గమనిస్తాను ...
ఫోను పక్కన పెట్టి ,
మరోపనిలో _
నిమగ్నమయి పోతాను !
మళ్ళీ ....
" కుక్క తోక వంకర "
సామెతకు .....
మనః స్పూర్తిగా ,
లొంగిపోతాను .....!!