ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మొలకా ! ఓ మొలకా ! ఎవరే నువ్వు--రచన.పోలయ్య కవి కూకట్లపల్లి--హైదరాబాద్ - 9110784502
September 16, 2020 • T. VEDANTA SURY • Poem

మొలకా ! ఓ మొలకా ! ఎవరే నువ్వు? బాలకా ! ఓ బాలికా ! నేను మీ 
ఊరి మోటుబావి "గిలకను" 
అయితే బావిలో నీరుతోడి 
మా దాహం తీర్చవా ?
ఓకే.....ఓకే.....థ్యాంక్యూ.....థ్యాంక్యూ
 
మొలకా ! ఓ మొలకా ! ఎవరే నువ్వు? బాలకా ! ఓ బాలికా ! నేను మీ పంజరంలోని పంచదార "చిలకను" 
అయితే మా కోసం ఒక మంచి 
పాట పాడి వినిపించవా ?
ఓకే.....ఓకే.....థ్యాంక్యూ....థ్యాంక్యూ 

మొలకా ! ఓ మొలకా ! ఎవరే నువ్వు ?
ఓ బాలకా ! ఓ బాలికా ! నేను మీ బోసినవ్వుల తాత "పిలకను" 
అయితే మాతో వస్తావా మా ఇంటికి 
తాతయ్యతో బోలెడు కథలు చెప్పిస్తాం
ఓకే.....ఓకే.....థ్యాంక్యూ....థ్యాంక్యూ 

మొలకా ! ఓ మొలకా ! ఎవరే నువ్వు? 
ఓ బాలికా ! ఓ బాలికా ! నేను మీరు రోజు బడికి మోసుకుపోయే "పలకను" 
అయితే మాకు అ...ఆ...ఇ...ఈ.. లు నేర్పిస్తావా  ?
ఓకే.....ఓకే.....థ్యాంక్యూ.....థ్యాంక్యూ