ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మొలక మిత్రులందరికి నమస్సులు ! 29-07-2014 నాడు సాహితీ విశ్వంభరుడు డా.సినారె గారి 84 వ పుట్టిన రోజు సందర్భం గా ఉదయం 11.10 ని .లకు చరవాణి ద్వారా సినారె గారికి వినిపించిన కవిత... ." ఓ నిత్య చైతన్యమూ(స్ఫూ)ర్తీ! మీ చిన్నప్పటి బుడి బుడి అడుగులను చూసేనేమో... మన ' మూలవాగు ' మెల్ల మెల్లగా నడవడం నేర్చు కున్నట్టుంది ... మీ వడి వడి నడకలను గమనించేనేమో.. మన ' నక్కవాగు ' తన ఒర' వడి ' ని మార్చుకున్నట్టుంది .. మీరు పుట్టిన పల్లె హనుమాజిపేటలో నేను ఓ ఐదేండ్లు చదువుకున్నందుకేమో.. మా మల్లారం లో నేను ' బాల ' కవిని అయినట్టున్నాను! .నిజంగానే.. మీ మా(పా)ట కమనీయం ,రమణీయం , మననీయం ,స్మరణీయం .. మీ బాట ఆదర్శనీయయం ,ఆచరణీయం , అనుసరణీయం ! మీ బాలవర్ధిరాజు.మల్లారం " అని అన్నాను. నన్నెంతో ప్రేమగా ఆశీర్వదించారు. ఇలా ప్రతి పుట్టిన రోజు నాడు చరవాణి లో పుట్టిన రోజు సందర్భంగా సినారె గారికి శుభాకాంక్షలు చెప్పడం 1998 నుండి నాకో అలవాటుగా మారింది.గత మూడేళ్ళ నుండి ఆ అవకాశం లేకుండా పోయింది. 1997 నుండి సినారె గారితో ఎన్నో మధుర జ్ఞాపకాలు, ఎన్నెన్నో మరపురాని అపురూపమైన ఘట్టాలు .అవన్నీ సదా మదిలో మెదులుతూనే ఉన్నాయి.ఎన్నటికీ మరచిపోని,మరువలేని మధుర జ్ఞాపకం సినారె.- మీ. బాలవర్ధిరాజు మల్లారం
July 29, 2020 • T. VEDANTA SURY