ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
యద్భావం తద్భవతి--కె ఎస్ అనంతాచార్య.
September 18, 2020 • T. VEDANTA SURY • Poem

ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన
అంతమాత్రమే నీవు
అంతర్గత సంఘర్షణల ఆవిష్కారం

ఉత్తమ తలపులు మలుపులు తిరుగుతూ విజయం సాధించే యుక్త తమములు

ఒక నకారాత్మక ఊహ
డోలాయమానంలో
పడేసి జన్మ దుఃఖాన్ని
కలుగజేస్తుంది

మానసిక దౌర్భలత
ఆవహిస్తే  ఆలోచనలు
అపభ్రంశం చెంది
ఆత్మహత్యలకు దారితీస్తాయి

కలలో కురిసిన వసంతం కావ్యంలో
ఋతు గీతం ఆలపిస్తోంది

ఒత్తిడిని జయించడం కోసం  యోగాసనంపై
ఉచ్వ్వాస నిశ్వాసాల్లో
తిరిగే ఊపిరి !

నాన్నా పులివచ్చే కదా  కరోనా పులికి కూడా వర్తించి  మానవారణ్యంలో
పంజా వేస్తుంది

ఆందోళన ముసురుకొంటే ప్రశాంతత 
డోలాయమానం లో పడిపోతుంది

కదిలించే  
సంఘటనలే
కొత్త కథలు  సృష్టిస్తాయి


బీజం ఏదో
మొలక అదే
భావన ఏదో భవిష్యత్ అదే