ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
యాదికొచ్చిన కాళోజీ: సామల కిరణ్-9949394688
September 9, 2020 • T. VEDANTA SURY • Poem

పలుకుబడుల భాష కావల్నని
పంతం పట్టిండు
అన్యభాషలొచ్చి తెలుగు రాదన్నోన్ని
చావుమన్నడు
భాష మీద పావురంతోని ప్రజలకోసం
గ్రంథాలయాలు పెట్టిండు
ఎవలో ఏమో అనుకుంటరని మనం
మన యాస మరువద్దండు
మట్టి మీద మమతతోని రజాకర్లతో
లడాయి జేసిండు
ధర్మం మీద దండిభక్తితోని వరంగల్లుల
గణపతుల పెట్టిండు
గాంధిబాటలోనే నడిచిన ఎదురుదాడికి
ఎనుకాడనోడు
మనోడే మనల్ని మోసం జేస్తే మట్టిల
బొందపెట్టమన్నడు
లక్షమెదళ్ళు కదిలియ్యడానికి ఒకే ఒక్క
సిరాచుక్క చాలన్నడు
పుట్టుక నీది-చావు నీది- బ్రతుకంత
దేశానిది అని చెప్పిండు
ఎన్ని ఇనాంలొచ్చినా- ఎంత అణుకువ
ఎన్నో వైలు రాసినా- ఎంత మెలకువ
పొద్దుగాల్నే యాదికొచ్చిన ఆయనే
మన తెలంగాణ"గొడవ"కాళోజీ
మన తెలంగాణ"జీవనగీత''కాళోజీ
-సాకి