ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
యోగాసనాలు లేక వ్యాయామం -2 ఆరోగ్యం - పి . కమలాకర్ రావు
October 2, 2020 • T. VEDANTA SURY • health tips

యోగాసనాలు , ప్రాణాయామం గురుముఖత నేర్చుకుని చేస్తే మంచిదే . అలా కుదరని వారు తేలికైన నడకతో ప్రారంభించి ప్రతి రోజు 20 నిమిషాల నుంచి ఒక గంట వరకు ఒంటికి చమట పట్టునట్లు వారి వారి ఆరోగ్య స్థితులను బట్టి ప్రతి రోజు వాకింగ్ చేయాలి. ఇది కూడా మంచి వ్యాయామమే ఉదయం సూర్య కిరణాలు శరీరం పై పడితే చాలా మంచిది . విరమిన్ . డి. ప్రకృతి ద్వారా లభిస్తుంది . చర్మం కాంతి వంతమవుతుంది. సోమరి తనం బద్ధకం తగ్గి శారీరక శక్తి పెరుగుతుంది. శరీరానికి మంచి ఆకృతి కలుగుతుంది. శరీరానికి   వాతావరణ పరిస్థితుల మార్పును తట్టుకునే శక్తి పెరుగుతుంది. వ్యాయామం చేసే వారికీ ఆకలి పెరిగి ఆరోగ్యం బాగు పడుతుంది. వ్యాయామం చేసే వారికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వృద్ధాప్యము దరి చేరదు .