ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
యోగాసనాలు -1 ఆరోగ్యం - పి . కమలాకర్ రావు
October 1, 2020 • T. VEDANTA SURY • health tips

యోగాసనాలు వేయడం వలన నిద్రాణమై వున్న జీవ శక్తి చైతన్యవంతమవుతుంది. ఈ ఆసనాలు కండరాల్లో కదలికను పెంచి నూతన కణజాలం తయరీకి దోహద పడుతుంది. యోగమనేది జీవన వైఖరి కావాలి. తేలికైన ఆసనాలు నరాలను ఉతేజపరచి రక్త ప్రసారంపై తోడ్పడి శరీరంలో బలాన్ని పెంచుతాయి. యోగాసనాల వలన శరీరంలో సంకోచ వ్యాకోచాలు కలిగి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. యోగాసనాలతో పాటుగా ప్రాణాయమాన్ని కూడా సరియైన పద్ధతి లో ఆచరిస్తే జీర్ణకోశ సమస్యల్ని తగ్గించి ఎన్నో వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ప్రాణా యామాన్ని గురుముఖత నేర్చుకుని ప్రతి రోజు చేస్తుంటే ఊపిరి తిత్తులలోనికిశాతం ఎక్కువగా చేరి , గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. యోగాసనాలు మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాయి. అందరూ యోగా వైపు ద్రుష్టి మళ్లించాలి.