ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
యోగ ముద్రలు - ఆరోగ్యం - పి . కమలాకర్ రావు
September 19, 2020 • T. VEDANTA SURY • health tips

మన ఆరోగ్యం కాపాడటం లో యోగ ముద్రలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. మన చేతి వేళ్ళ ద్వారా వేసే యోగ ముద్రలు మానవ శరీరం లోని ప్రాణ శక్తిని ఉద్దీపనం చేస్తాయి. పంచ భూతాలలోని అగ్ని, గాలి, ఆకాశం , భూమి , నీరు , ఐదు వెళ్లాలో సంకేతాలుగా ఉంటాయి. బొటన బేలు అగ్నికి, చూపుడు వేలు గాలి, మధ్య వేలు ఆకాశం , ఉంగరం వేలు భూమి, చిటికెన వేలు నీరు, ముద్రలు వేసిన వెనువెంటనే దీని ప్రభావాన్ని వ్యతిరేక దిశలో అంటే కుడి చేసి వైపు వేస్తె ఎడమ భాగాన్ని ఎడమ చేతి వేస్తె కుడి భాగాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి ప్రశాంతంగా పద్మాసనం లేదా సుఖాసనం లో కూర్చొని ప్రతి రోజు ప్రారంభం లో పది నిమిషాలు ఆ తరువాత అరగంట వరకు మెల్ల మెల్లగా వేయాలి. యోగ ముద్రలు వేయడం వాలా విశేష మైన లాభాలు ఆరోగ్య సిద్ధి లభిస్తుంది. 
ముద్రలు రోజుకు ఒకటి చెప్పున ఇక్కడ ఇస్తాము . ప్రారంభం లో ఐదు నుంచి పది నిమిషాలు చేయాలి. యోగ ముద్రలు విశ్రాంతి గా కూర్చొని చేయాలి. 
జ్ఞాన ముద్ర లేక ధ్యాన ముద్ర 
బొటన వేలు , చూపుడు వేలు చివరల కలిపి ఉంచి మిగతా మూడు వేళ్ళను చక్కగా నిటారుగా ఉంచాలి. ఇది రెండు చేతులతో చేయాలి. వెన్ను పాము నిటారుగా ఉంచాలి. ముద్ర వేసిన చేతులు తొడలపై ఆనించి ఉంచాలి. 
లాభాలు : ఏకాగ్రత , ధ్యాన శక్తి  పెరుగుతుంది. వ్యతిరేక ఆలోచనలు తగ్గుతాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చిన్న పిల్లలు చేస్తే చురుకుదనం పెరుగుతుంది. మేధా శక్తి పెరుగుతుంది. తలనొప్పి , నిద్ర రాకపోవడం , మానసిక దౌర్భల్యం తగ్గుతుంది. కోపం తగ్గి మనశాంతి చేకూరుతుంది.