ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రండి.రండి.నా మొలక మిత్రులారా.మీ కోసం వచ్చాడు మీసంతోష్ బాబు మామయ్య.ఈరోజు మనం మన పీవీ తాత బాల్యం లోని ఒక చిలిపిచేష్ట గురించి తెలుసుకుందాం. ఆయనకు సుమారునాలుగు ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు ఈ సంఘటనజరిగింది.ఆ రోజులలో పల్లెల్లో హరికథా కాలక్షేపాలు విరివిగా జరిగే వి.వేరేప్రదేశాల లోనుంచి విద్వత్తు గల హరిదాసులు వచ్చికొన్నిరోజుల పాటు ఆగ్రామం లోనే నివాసం ఉండి ప్రతి సాయంత్రం ఒక ఇతిహాసాలలోని అంశాలను కథలు గాచెప్పేవారు.పీవీ తాత భవంతి ముందు ఒక చిన్న శివాలయం, దానిని ఆనుకొని ఒక వేపచెట్టు ఉండేవి.ఓ సారి మంథని గ్రామం నుండిఓ హరిదాసువచ్చినాడు.గ్రామపెద్ద,కరణం అయిన సీతారామారావు ఇంట్లోనే ఆయన బస.ఓరోజు రామాయణంలోనుంచి మరో రోజు భాగవతం నుంచి ఒక అంశంపై వీనుల విందుగా కథ చెప్పేవారు.ఓరోజు రామాయణం లోని లంకాదహనం గురించి ఎంతో వినసొంపుగా, కళ్ల కు కట్టినట్లుగా హరికథ చెప్పారు.ఆ హరిదాసుగారు.మిగతా రేపటికి.సరేనా.
June 25, 2020 • T. VEDANTA SURY • Serial