ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రక్త ప్రసరణ వ్యవస్థ ( బ్లడ్ సర్ క్యులేషన్); --ఒక్కసారిగా శరీర భాగాలన్నింటికి రక్త ప్రసరణ జరగాలంటే రక్తం రెండు సార్లు గుండె గుండా ప్రసరించాలి.అందువలన ప్రసరణ వ్యవస్థ ను రెండు భాగాలుగా విభజించవచ్చును.అవి,1.శరీర ప్రసరణ ( సిస్టమిక్ సర్క్యు లేషన్) ,2.పుపుస ప్రసరణ ( పల్మునరీ సర్ క్యులేషన్).శరీర ప్రసరణలో రక్తం చాలా దూరం సరఫరా కనబడుతుంది.పుపుస రక్త ప్రసరణలో రక్తం చాలా తక్కువ దూరం సరఫరా అవుతుంది అంటే ఊపిరితిత్తుల వరకే.శరీర ప్రసరణ (సిస్టెమిక్ సర్ క్యులేషన్);ఇది ఎడమ జఠరిక నుంచి ప్రారంభమయ్యే అయోటా ద్వారా మొదలవుతుంది.అయోటా అనేక ధమనులగా విడిపోయివివిధ శరీర భాగాలకు మంచి రక్తాన్ని అందజేస్తుంది.ఇది మెదడుకు రెండు అంతర కరోటాలు ( ఇంటర్నల్ కారోటిడ్), రెండు వెర్టిబ్రల్ ధమనుల ద్వారా రక్తాన్ని సరఫరా చేస్తుంది. హెపాటిక్ ఆర్టరీ ద్వారా కాలేయానికి,రీనల్ ఆర్టరీ ద్వారా మూత్ర పిండాలకు, మిగతా శరీర భాగాలకు కాపిలరిస్ ద్వారా రక్తం సరఫరా చేస్తుంది.శరీరంలోని చెడు రక్తం అనేక కేశ నాళికలతో ప్రారంభమై పూర్వ,పేరు,ముఖ్య సిరలుగా ఏర్పడి కుడి కర్ణికకు చేరుకుంటుంది ఈ వ్యవస్థ ముఖ్య విధి శరీరం భాగాలందలికణజాలానికి ఆక్సిజన్,ఇతర పోషక పదార్థాలను అందించడం, తరువాత కణజాలంలో ఏర్పడిన చెడు పదార్థాలను తొలగించడం.మిగితాది రేపు...... ప్రమోద్ ఆవంచ
August 2, 2020 • T. VEDANTA SURY • Serial