ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రధులు-సారధులు.( బేతాళకథ.)-- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై .-పట్టువదలని విక్రమార్కుడు ఎప్పటిలా చెట్టుపైని బేతాళుని భుజంపై వేసుకుని మౌనంగా బయలుదేరాడు.'మహీపాల అష్టాదశపురాణలతోపాటు సమస్త పురాణాలు ఔపాసన పట్టిన నీవే నాకు చాలాకాలంగా ఉన్న సందేహాన్ని తీర్చాలి.యుధ్ధంలో రధసారధుల బాధ్యతలు ఏమిటి తెలియజేయి.నాప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పలేక పోయావో తలపగిలి మరణిస్తావు'అన్నాడు బేతాళుడు.బేతాళా రధికునికంటే అధికుడైన వీరుని సారధి చేయడం ధర్మం. సూర్యునికి అనూరుడు,శివునికి బ్రహ్మ,ఇంద్రునికి మాతాలి,అర్జునునికి శ్రీకృష్ణుడు,కర్ణునికి శల్యుడు,శ్రీకృష్ణునికి దారకుడు,రావణునికి కాలకేతకుడు,రామ రావణ యుద్ధంలో ఇంద్రుడు తన సారధిని మాతాలిని రధం తో రాముని వద్దకు పంపించాడు.నకులునకు వార్షేయుడు, పరశురామునికి అకృతవ్రణుడు, ధర్శరాజుకు ఇంద్రసేనుడు రధసారధులుగా ఉండేవారు.రధసారధికి యుధ్ధతంత్రం గురించి సందర్బోచితంగా రధికునకు చెప్పగలిగే సామర్థ్యం,శాస్త్రవిజ్జానం,అన్నిరకిల యుధ్ధాలలో మెళకువలు,గుర్రాల శారీరకస్థితి అంచనావేయగలిగే నేర్పు క్షుణంగా తెలిసి ఉంటుంది. పద్మవ్యూహంలోనికి వెళ్ళడం ప్రమాదమని అభిమన్యుని హెచ్చరించాడు అతనిసారధి సుమిత్రుడు.అనుక్షణం అర్జునుని పొగుడుతూ కర్ణుని యుధ్ధభూమిలో నిరుత్సాహ పరచాడు శల్యుడు.భృహన్నలవేషంలో ఉత్తరకుమారునికి సారధిగా వెళ్ళిన అర్జనుడు కౌరవ వీరులను వారి బలపరాక్రమాలను తెలియజేసాడు.భీమునిరధం యుధ్ధభూమిలో భీముని రధం శిధిలమైన సమయంలో అతని సారధి విశోకుడు మరోరధం తెచ్చి ఆదుకున్నాడు.యుధ్ధభూమిలో తన రధానికి కట్టిన శైబ,సుగ్రీవ,మేఘ, పుష్ప,వాలాహకములు అనే అశ్వాలు .గాయపడినప్పుడు శ్రీకృష్ణుడు వాటికి గుచ్చుకున్న బాణాలను తొలగించి 'హిరణ్యతి' నదీతీరానికి తీసుకువెళ్ళి నీళ్ళుతాగించి మరలా రధాన్ని యుధ్ధభూమికి తీసుకు వచ్చాడు శ్రీకృష్ణుడు .మహాభారత సంగ్రామంలో ప్రద్యుమ్నుడు,రుక్మరధుడు(రుక్మిణి సోదరుడు)దుర్యోధనుడు, శల్యుడు, ద్రుపదుడు,సాత్యకి, భీముడు,శకుని, సోమదత్తుడు,విరాటుడు,అశ్వత్ధామ,ఉత్తమోజుండు మొదలగు పలువురు వీరులు యుధ్ధభూమిలో మూర్చితులుకాగా వారందరిని రధసారధులే రక్షించారు.ఒక రధానికిఇరువైపులా కావలిగా ఉండేవారిని చక్రరధులు అంటారు.అలాగే రధంపై ఉండి యుధ్ధ చేసే వీరునికి బలపరాక్రమ సాహాసాలతో పాటు ధైర్యం,అస్త్రప్రయోగ కౌశలం,ఆయుధాల ప్రయోగం క్షుణంగాతెలిసి ఉండాలి'అన్నాడు విక్రమార్కుడు. అతనికి మౌనభంగం కావడంతో శవంతోసహా బేతాళుడు మాయమై చెట్టుపైకి చేరాడు.పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెనుతిరిగాడు.
July 29, 2020 • T. VEDANTA SURY • Story