ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రాజ శ్రీ ......... 26 అంజన్న సంద్రం దాటినాడు అశోక వనం వెళ్లినాడు మాత సీతను చూసినాడు రామచంద్రుని చూడమణి ఇచ్చినాడు 27 కోపంతో గుణాన్ని కోల్పోతారు వదరుబోతుతో ప్రశాంతత కోల్పోతారు అహంకారంతో ప్రేమను కోల్పోతారు అబద్ధాలతో పేరును కోల్పోతారు 28 ఆందోళనతో అందాన్ని కోల్పోతారు ఆవేశంతో ఆయుర్దాయాన్ని కోల్పోతారు భయంతో ధైర్యాన్ని కోల్పోతారు పిరికితనంతో విజయాన్ని కోల్పోతారు 29 సింహం పరాక్రమానికి నిదర్శనము కుక్క విశ్వాసానికి నిదర్శనము కోకిల గాత్రానికి నిదర్శనము ఏనుగు బలమునకు నిదర్శనము 30 గెలుపు ఆనందాన్ని ఇస్తుంది ఓటమి అనుభవాన్ని పెంచుతుంది చెడు ద్వేషం పెంచుతుంది మంచి ప్రేమను పంచుతుంది ....జాధవ్ పుండలిక్ రావు పాటిల్ భైంసా నిర్మల్ జిల్లా ౯౪౪౧౩౩౩౩౧౫
June 29, 2020 • T. VEDANTA SURY • Poem