ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రామచిలుక--ఉండ్రాళ్ళ రాజేశం
August 23, 2020 • T. VEDANTA SURY • Poem

రామచిలుక వచ్చింది
చెట్టుపైన వాలింది
రామ రామని పిలిచించి
చిలుకలన్ని చేరాయి
జామకాయలను కొరికాయి
కొమ్మలపై ఆడాయి
పండ్లనన్ని రాల్చాయి
అడుగుల శబ్దం విన్నాయి
తుర్రుమని ఎగిరాయి
బామ్మ కింద పండ్లనుచూసింది
ఒడినిండా ఇంట్లోకి తీసుకొచ్చింది
చిలక కొట్టిన పండ్లని పంచింది
తమ్ముడు, చెల్లి, నేను తిన్నాము
మంచిగున్నయని మురిసాము
చిలుకలను చూడగానే రామ రామ అన్నాము
చెట్లపై చెలిమితో సాగాము