ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రాము గాడి స్నేహబంధం ( బాలల కథ ) - అక్షర కూరపాటి ( మిన్ను )
November 23, 2020 • T. VEDANTA SURY • Story

ఒకానొకప్పుడు విశ్వాపురం అనే గ్రామం ఉండేది. అక్కడ  ఒక పేద కుటుంబం నివసిస్తుంది . 
అక్కడ రాము వాళ్ళ అమ్మ నాన్న ఉండేవాళ్లు . పాపం వాళ్ళ నాన్న రోజూ  జమిందారు దగ్గర పని
చేస్తూ ఉంటాడు . కానీ ఆయన నెల జీతం 100 రూపాయిలు , అవి సరిపోక ఆయన నానా తంటాలు పడుతూ , అక్కడా ఇక్కడా అప్పులు చేస్తూ తేర్చలేక అవస్థలు పడుతుండేవాడు . అవి ఏవి పట్టిచ్చుకోని
7 ఏళ్ల  రాము హాయిగా ఎగురుతూ బయట ఆడుకుంటూ ఉండేవాడు . అప్పుడు రాము కి జమిందారు కొడుకైన విశ్వం పరిచయమయ్యాడు 
, కానీ రాము ఎంత స్నేహ భావం తో ఉండేవాడో విశ్వం అంత అహంకారం తో ఉండేవాడు.
కానీ రముకి వాడితో స్నేహం చేయడం ఇష్టం . ఒకసారి అలాగే రాము విశ్వం తో “ రే విశ్వ రారా అడుకుందాం’’ అని అంటూ వెనకాల తిరుగుతూ ఉంటాడు . అల ఒక రోజు జమిందారు రాము ని బయటకి తరిమి “ రేయ పాపిష్టి వెదవ
మా ఇంట పనిచేసే ఒక పనివాడి కొడుకువి . నా కొడుకుతో ఆడనివ్వడమే గొప్ప ఇంకా మా ఇంట్లోకె వస్తావా పోరా
దరిద్రుడా’’.. అని అంటాడు . అంతే ఆ మాటతో రాముకి ఎలాగైనా గొప్పవాడై చూపించాలి అని అనుకుంటాడు . ఈలోపు రాము వాళ్ళ నాన్న హటాత్తుగా మరణిస్తాడు .
అప్పటి నుంచి రోజూ బడికి వెళ్ళి బాగా చదువుకొని ఏదోలాగా ఒక ఉద్యోగం సంపడిస్తాడు.  రాము వాళ్ళ అమ్మ ని తీసుకొని , నగరానికి వెళ్ళి వాడే ఒక సొంత అఫ్ఫిసు పెడుతాడు . మెల్లగా  వాడి అఫ్ఫిసు పెద్ద కంపెనీ గా మారుతుంది, రాము చాలా సంతోషపడి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి “ అమ్మ నేను చాలా పెద్ద స్థాయికి ఎదిగాను కాబట్టి మనం మన ఊరు తిరగీళ్లదాం. దానికి అమ్మ “ ఎందుకు నాయన మళ్ళీ మన ఊరు ఆ జమిందారు మనల్లి ఊళ్ళోకి రానివ్వడు.’’ అని రాము తల్లి అంటుంది అప్పుడు రాము “ అమ్మా.. వాడు నేను పెడవడినని వెల్లకొట్టాడు ఇప్పుడు నేను బాగా సంపడదిస్తున్నాను కాబట్టి నేను వాడికి బుద్దిచెప్పి నా స్నేహాన్ని తిరిగి తెచ్చుకుంటాను.” అలా చెప్పి పెట్టె సర్దుకుంటాడు. రాము  వాళ్ళు తిరిగి ఊర్లలోకివస్తుంటే జమిందారు మనుషులు వాళ్ళని అడ్డగిస్తారు . వాళ్ళని తోసుకుంటూ ముందుకి సాగుతాడు రాము ఇంకా వాళ్ళ అమ్మ . రాము జమిందారు దగ్గిరికి వెళ్ళి “ రే జమీందార్ రారా బయటకి.” అని పిలుస్తాడు అప్పుడు జమిందారు బయటకి వచ్చి “ ఎవడ్రా వాడు” అంటాడు .
అప్పుడు రాము “ నేను రా రాముని ” అంటాడు రాము . దానికి జమీందార్ బయటకి వచ్చి “ పోరా పేదవాడ  ”. అని అంటాడు . దానికి “ రే నేను ఇప్పుడు పెదవడిని కాదు రా గొప్ప కంపెనీకి ముక్య ఆదిపతిని” అని రాము రెచ్చిపోతాడు. ఆ అరుపులకి విశ్వం బయటికి వచ్చి రాము ని చూసి ఆశ్చర్యం గా చూస్తూ “ రే రాము నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నవు”అని అడుగు తాడు. దానికి రాము “ మీ నాన్న కి బుద్ధి చెప్పి నిన్ను ఈయన నుంచి తీసుకు వెళ్ళడానికి వచ్చాను” అని రాము అంటాడు . అప్పుడు జమిందారు రాముతో “ రాము నన్ను క్షమించు నేను నీ స్నేహ భావాన్ని తెలుసుకోలేక పోయాను”అని వేడుకుంటాడు. దానికి రాము క్షమించి “ జమీందార్ నేను నిన్ను క్షయమిస్తున్నాను, ఎందుకంటే నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు ” అని అంటాడు. అప్పుడు జమిందారు , రాము , విశ్వం , రాము వాళ్ళ అమ్మ చాలా సంతోషంగా ఉంటారు.