ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రావణుని జననం(పురాణకథ) డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
November 21, 2020 • T. VEDANTA SURY • Story

విద్యుత్కేశుని కుమారుడు 'సుకేసుడుఇతను మలయ పర్వతంపై జన్మించాడు.ఇతను పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం పొంది గంధర్వను కుమార్తే 'దేవవతి'ని వివాహం చేసుకున్నాడు.వీరికి 'మాల్యవంతుడు' 'సుమాలి' 'మాలి' అనే కుమారులు జన్మించారు.సుమాలి'కేతుమతి'అనే గంధర్వకన్యను వివాహం చేసుకోగా వీరికి'ప్రహస్తుడు' 'అకంపనుడు' 'వికటుడు'శకటీముఖుడు''ధూమ్రాక్షుడు''దండుడు'సుపార్మ్వడు'సంహాద్రి''ప్రఘనుడు'అనేకుమారులు,'బాల''పుష్పోత్కట'కైకసి''కుంభీనస'అనేకుమార్తెలు జన్మించారు.సుమాలి తన అందమైన కుమార్తె ద్వారా రాక్షస జాతికి వీరులను సంతానంగా పొందదలచి, బ్రాహ్మణుడైన 'మిశ్రోవోమహర్షి' వద్దకువెళ్ళి ఆయనద్వారా సంతానాన్ని పొందమని కైకసిని పంపించాడు. తండ్రి ఆజ్ఞమేరకు మిశ్రవోమహర్షి వద్దకు వెళ్ళిన కైకసి ఆవిషయం ఆయనకు  తెలియజేసింది.అప్పుడు ఆమహర్షి'ఓకైకసి శివభక్తురాలవైన నీకోరిక తీర్చవలసిందే,కాని ఇది సంధ్యాసమయం.ఈమహుర్తం దారుణమైనది. నీకోరిక ప్రకారం ముగ్గురు పుత్రులను ప్రసాదిస్తాను. వారిలో ఒకరు గొప్పబ్రాహ్మణుడు,రాక్షసుడు అనతగినవాడు జన్మిస్తాడు . రెండోవాడు పూర్తి రాక్షసమస్తత్వంతో భీకర ఆకారుడుగా జన్మిస్తాడు. మూడవవాడు కేవలం బ్రాహ్మణ మనస్తత్వంతో జన్మిస్తాడు' అనివరంప్రసాదించాడు.అలా కైకసికి ముగ్గురు పుత్రులు కలిగారు. మోదటివాడు 'రావణుడు'రెండోవాడు 'కుంభకర్ణుడు'ఇతను రాక్షసగుణ సంపన్నుడు, మహాబలశాలి, అతికాయుడు.మూడవవాడు'విభీషణుడు'ధర్మాత్ముడు,ఋషితుల్యుడు.వీరు అలా తండ్రి వారసులుగా బ్రాహ్మణులు అయ్యరు,తల్లిద్వారా రాక్షస రాజ్య పాలకులుగా కొనసాగారు. మహవీరుడు, తపశ్వి అయిన రావణుడు ఒకసారి కైలాసం వెళ్లి నందిని చూసి నవ్వాడు. అందుకుకొపించిననంది 'నారూపాన్నిచూసినవ్వుతావా వికృతి రూపులైన వానరుల చేతిలో నీసైన్యం నశిస్తుంది'అనిశపించాడు. ఇక్ష్వాకవంశీయుడైన 'అనరణ్యుడు'అనేరాజును యుద్ధంలో రావణుడు సంహరించగా అతను మరణిస్తూ'మావంశస్తూడి చేతిలో మరణి స్తావు' అనిశపించాడు .యోగదీక్షలో ఉన్న'వేదవతి'ని రావణుడు బలత్కరించబోగా 'అయోజనగా పుట్టి నీమరణానికి కారణంఅవుతాను'అనిశపించి భస్మంఅయింది.మరో సమయంలో పార్వతి దేవి కూడా శపించింది.'పుంజకస్ధల'-'రంభా'లను బలత్కరించిన రావణుడు,బ్రహ్మదేవునిచే 'పరస్త్రీలను బలత్కరిస్తే మరణిస్తావు అని శపించాడు.ఆత్మలింగాన్ని సాధించిన భక్తుడు, పండితుడు,తపోశక్తి శంపన్నుడు,కైలాసానే శిరస్సునధరించిన  మహాబలశాలి కెవలం పరస్త్రీవ్యామోహంలోసీతను అపహరించి అవతారమూర్తి శ్రీరాముని చేతిలో తనప్రాణాలు రావణుడు కోల్పోయాడు.