ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రా రండీ రా రండీ.మొలక మిత్రులారా.మీ సంతోష బాబు మామయ్య ఈరోజు ముచ్చట్ల తో వచ్చాడు మీముందు కు. ఈరోజుమనం పీవీ తాత బాల్యం గురించి కొన్ని కబుర్లుచెప్పుకుందాం.వంగర లో విశాలమైన వాకిలి ఉండేది. ప్రతిరోజూ సాయంత్రంకాగానే ఆరుబయట మంచాలు వేసేవారు.వాటిలో పడుకొని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడం ఓ సరదా.అప్పట్లో గ్రామాల్లో విద్యుత్ దీపాలు ఉండేవి కావు.ప్రతిసాయంత్రం పీవీ తాత బాపు సీతారామా రావు మంచంమీద పడుకొని కొడుకును ప్రక్కనే కూర్చొన బెట్టుకొని పోతన భాగవతం ,దాశరథి శతకము, న్రృసింహ శతకం, ల లోని కొన్ని పద్యాలు పీవీకి వినిపించేవాడు.ఆయనకు అవి కంఠస్థం.బాలుడు పీవీ ఏ పద్యం ఐనా ఒకసారి వినగానే మళ్లీ తాను చదివి తండ్రికి వినిపించేవాడు.అలాంటివారిని ఏక సంతాగ్రాహి అంటారు.అప్పుడు ఆయన వయస్సు నాలుగు సంవత్సరాలు మాత్రమే.ఆయనకుఅక్షరాలు రాకముందే పద్యాలు చదవడం వచ్చింది.ఒక సారి వింటేచాలు మరచిపోయే ప్రసక్తేలేదు.మళ్ళీ రేపుమరో ముచ్చటతో వస్తాడు మీ సంతోష్ బాబు మామయ్య.సరేనా
June 23, 2020 • T. VEDANTA SURY • Serial