ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రేపటి భవితకు ఏమి ఇద్దాం--చిటికెన కిరణ్ కుమార్ సెల్.. 9490841284
September 16, 2020 • T. VEDANTA SURY • News

(సెప్టెంబర్ 16 న...అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం సందర్భంగా..)
 ఒక్క క్షణం ఆలోచించి.. భావితరాలకు బాసటగా నిలుద్దాం.. ప్రపంచమంతా యాంత్రిక జీవితంలో ముందుకు వెళుతున్న సందర్భంలో సంఘటిత అంశం అయినటువంటి వాతావరణాన్ని పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నది. కానీ మనం ఎంత వరకూ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ ఓజోన్ పొర వల్ల భవిష్యత్తులో జరిగే  ప్రభావాల ఫలితం ప్రతి ఒక్కరికి కూలంకుషంగా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనగా రేపటికి రూపం కావాలి.
          మరి రేపటి ప్రపంచ మనుగడ కోసం మనమే బాధ్యత తీసుకోవాలి. భావితరాలు సురక్షితంగా ఉండాలి అంటే ఇప్పటి నుండే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటేనే రేపటికి రూపం ఉంటుందని భావించాలి. నేటి కాలంలో హైదరాబాద్,  ఢిల్లీ, ముంబాయి లాంటి మహా నగరాలలో ఎంత కాలుష్యం ఉంటుందో మరొక్కసారి మీకు తెలియజేయడం అవసరం లేదు. కానీ వాటితో పాటుగా నేడు చిన్న చిన్న పట్టణాల తో పాటుగా ప్రతీ గ్రామాల తో సహా కాలుష్యం తో కూడుకొని పర్యావరణాన్ని, వాతావరణాన్ని కాలుష్యం చేయుచున్న విషయం కూడా మీకు తెలిసినదే.. ఎందుకు మీకు ప్రత్యక్ష సాక్ష్యం గా చెప్పాలి అంటే ఒకప్పుడు ఒక ఇంటికి ఒక వాహనం మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి దాదాపుగా రెండు రెండు వాహనాలు ఉంటున్నాయి. ఆ వాహనాలతో చాలా పెద్ద మొత్తంలో కాలుష్యం ఏర్పడుతుంది. ఇప్పుడిప్పుడే భారతదేశంలో నిబంధనలతో కూడిన వాహనాలకు అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటే మనం పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. భావితరాలకు బాసటగా కూడా మనమే నిలుస్తాం. మరి భావి తరాల ను కాపాడుకోవాల్సి ఉంది మనమే కదా....!!  ఒక్కసారి ఆలోచించండి...!!  ఇది ఎవరి బాధ్యతో కాదు. మనందరి బాధ్యత మన అందరి సమిష్టి కృషి వల్లనే ఇది సాధ్యం అవుతుంది. ఇట్టి అంశంపై ప్రపంచం మొత్తంలో ఎన్నో సెమినార్లు, ఎన్నో సమావేశాలు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మన వంతుగా మన బాధ్యతను నిర్వహిస్తాం. కాలుష్యరహిత వాతావరణాన్ని భావితరాలకు నిర్మించుకుందాం.
            మరో ముఖ్యమైన విషయం చెప్పాలంటే మొన్నటి వరకు కరోనా కారణంగా మన దేశంతో పాటు వివిధ దేశాలలో లాక్ డౌన్ నిర్వహించడం వల్ల వాతావరణం ఓజోన్  పొరలో మార్పు ఎంతవరకు జరిగిందో మనం గమనించవచ్చు.

ఆమ్లజని (ఆక్సీజన్‌) మరో రూపమే ఓజోన్‌. ఇది విషవాయువు. ప్రతీ ఓజోన్‌ అణువులోను మూడు ఆమ్లజని పరమాణువులున్నాయి. దీని రసాయన సాంకేతికం O3 అతినీల లోహిత వికిరణాల కారణంగా వాతావరణం పై పొరలో ఆక్సీజన్‌ అణువులు (O2) విడిపోతాయి. స్వేచ్ఛగా ఉన్న ఆక్సీజన్‌ పరమాణువు (O), తాడితంతో ఆక్సీజన్‌ అణువులోకి చేరి (O3) ఆక్సీజన్‌ పరమాణువులుగా మారి ఓజోన్‌ అణువవుతుంది.
ఓజోన్‌ లాభ నష్టాలు
వాతావరణపు గాలి పొరలో (భూ ఉపరితలానికి సుమారుగా 15 - 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది) ఓజోన్‌ సహజంగా ఉంటుంది. సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలను భూమి పైకి రాకుండా అడ్డుకొని జీవరాశిని రక్షిస్తుంది. వాహనాల కాలుష్యం నైట్రోజన్‌ ఆక్సైడ్‌ల హైడ్రో కార్బన్‌ల స్థాయిలు పెరగడం వల్ల వాతావరణపు పైపొర భూఉపరితలానికి దగ్గర అయింది. సూర్యరశ్మిలో ఈ రసాయనాలు ఓజోన్‌గా మారతాయి. దగ్గు, గొంతు నొప్పి, ఉబ్బసవ్యాధిని పెంచడం శ్వాస కోశ వ్యాధులు మొదలగు సమస్యలను ఈ ఓజోన్‌ కల్గిస్తుంది. పంటలను కూడా నాశనం చేస్తుంది. వాతావరణపు గాలి పొరలో గల ఓజోన్‌ భూమిపై నున్న జీవరాశిని సూర్యుని నుండి వచ్చే అతినీలలో హిత కిరణాల నుండి రక్షిస్తుంది.
వాతావరణానికి దిగువున ఉన్న ఓజోన్‌ ఆరోగ్య సమస్యలను కల్గిస్తుంది.
ఓజోన్‌ తరిగిపోవడమంటే ఏమిటి?
• క్లోరో ప్లూరో కార్బన్‌లు  ఓజోన్‌ తరుగుదలకు ప్రాథమిక రసాయనాలు. రిఫ్రిజరేటర్లలో ఎయిర్‌ కండీషన్‌ మొదలగు వాటిలో రిఫ్రిజెంట్లుగా ఉంటాయి.ఇవి క్లోరీన్‌ను కల్గి ఉంటాయి.
• రెండవ దశః సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలు సి.ఎఫ్‌.సిని విచ్చిన్నం చేసి క్లోరీన్‌ని విడుదల చేస్తాయి.
• మూడవ దశః ఈ క్లోరీన్‌ పరమాణువులు ఓజోన్‌ అణువును విచ్చిన్నం చేసి ఓజోన్‌ తరిగి పోయేటట్లు చేస్తాయి.
ఓజోన్‌ తరిగి పోవడం వల్ల మన పై ప్రభావం ఎలా ఉంటుంది ?
ఓజోన్‌ పొర తరిగి పోవడం వల్ల అతి నీల లోహిత కిరణాలు భూమిని తాకడం అధికం అవుతుంది. దీని వల్ల జన్యువులు, కళ్ళు దెబ్బ తినడంతో పాటు సముద్ర జీవరాశి పై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.

అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం
ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది
అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం (అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం) ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్‌ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది.

చరిత్ర
సూర్యుని నుంచి వెలువడే కిరణాలు నేరుగా భూమిపై పడకుండా అందులో ఉండే అతినీలలోహిత వికిరణాలును ఓజోన్ పొర సంగ్రహించి, ప్రాణకోటికి వాటిల్లే ముప్పు నుంచి కాపాడుతుంది. మోటారు వాహనాలు పెరగడం, పరిశ్రమల కాలుష్యం, అధిక శాతం మంది ఏసీలను వినియోగించడం వలన ఓజోన్ పొర క్షీణించిపోతోందని 1987లో మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ (ఓజోన్‌ పొర క్షీణతపై జరిపిన పరిశోధన) సంస్థ తెలిపింది. ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్న పదార్ధాల నియంత్రణకు గాను రూపొందించిన మాంట్రియల్‌ ప్రొటోకాల్‌పై ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు 1987, సెప్టెంబర్‌ 16న సంతకాలు చేశాయి.[2] ఆ తరువాత 1994, సెప్టెంబర్‌ 16న మరో సమావేశం జరిపి, ఓజోన్ క్షీణతను అరికట్టాలని నిర్ణయించారు. దాంతో ప్రతి సంవత్సం సెప్టెంబరు 16న అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవం జరపాలని నిర్ణయించబడింది.
లక్ష్యం
1. పర్యావరణ మార్పులపై, ఓజోన్ పొర క్షీణతపై ప్రజలకు అవగాహన కల్పించడం.
2. అన్ని దేశాల ప్రభుత్వాలు మాంత్రియల్‌ ప్రొటోకాల్‌ను మరింత సమర్థంగా అమలుచేసి 2050 సంవత్సరానికి ఓజోన్‌ పొరను 1980కు ముందున్నస్థాయికి తేవడం
కార్యక్రమాలు
1. అడవుల నరికివేతను పూర్తిగా నిలిపివేయడం
2. మొక్కలను పెంచడం
3. యంత్రాల నుంచి వినాశకర వాయువులను విడుదల చేస్తున్న పరిశ్రమలు రక్షణ చర్యలు చేపట్టడం
ఇతర వివరాలు
1. 1980లో అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్‌ పొరకు రంధ్రం ఏర్పడిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
2. ప్రొటోకాల్‌పై సంతకం చేసిన 30 సంవత్సరాల తరువాత ఓజోన్ పొరలో రంధ్ర పరిమాణం తగ్గడం గమనించబడింది.
3. ఓజోన్ క్షీణతకు కారణమయ్యే వాయువుల స్వభావం కారణంగా వాటి రసాయన ప్రభావాలు 50 నుండి 100 సంవత్సరాల వరకు కొనసాగుతాయి.

ఎందుకు అంత ప్రాముఖ్యత?
మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పాలీయురేథేన్ ఫోమ్ ఉత్పత్తిలో చైనాలో ఉత్పత్తి అవుతున్నదే మూడో వంతు ఉంది. అందువల్ల సీఎఫ్‌సీ-11ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఓజోన్‌కు పడిన రంధ్రాన్ని పూడ్చేయడానికి పట్టే సమయం మరో దశాబ్దం లేదా అంతకన్నా ఎక్కువ కాలం పెరుగుతుంది.
ఓజోన్ పొరతో పాటు సీఎఫ్‌సీ-11 కారణంగా వాతావరణం వేడెక్కే అవకాశం కూడా ఉంది. దానిని ఇలాగే ఉపయోగిస్తే, దాని వల్ల వెలువడే వేడి ప్రతి సంవత్సరం బొగ్గుతో నడిచే 16 పవర్ స్టేషన్ల నుంచి వెలువడే కార్బన్ డైయాక్సైడ్‌తో సమానంగా ఉంటుంది.
మరి దీని గురించి ఏం చేయొచ్చు?
ఓజోన్‌కు రంధ్రాన్ని చేసే ఉత్పత్తులను నిషేధించే మాంట్రియల్ ప్రొటోకాల్‌లో చైనా కూడా సభ్యదేశమే. ఆ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిన దేశాలపై వాణిజ్యపరమైన ఆంక్షలను ఉపయోగించవచ్చు.
కానీ ప్రొటోకాల్‌పై సంతకాలు చేసిన నాటి నుంచి ఎన్నడూ ఏ దేశంపై అలాంటి ఆంక్షలను విధించలేదు. అయితే నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటేనే పరిస్థితి మెరుగుపడుతుందని ఈఐఏకు చెందిన మహాపాత్ర అన్నారు.