ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రోడ్!!- కె. ఎస్ . అనంతా చార్య జన ప్రవాహం ఎప్పుడూ ఆగదు ఎవరినీ ప్రశ్నించదు మంచి, చెడు లకు అతీతంగా రెండంచుల నల్ల చీర హృదయం పరచి రాత్రి పగలు మరిచి గమ్యం చేర్చే మిత్రుడు! దేహాన్నoతా శుద్దిచేసి తీర్చిదిద్ధి మెరిసిపోయే వర్షం కన్నా అమ్మ ఎవరు? నాలుగు దార్లు ఏకమైన చౌరస్తా లో ఎత్తిన పిడికిళ్ళు తెల్పిన నిరసన ప్రతిధ్వనులను కాల్చిన దిష్టిబొమ్మలను మోసిన గుర్తులు ఏమర పాటుతో గాలిలో కలసిన ప్రాణాల తాలూకు అపప్రదలను మోసే నల్లని వాడు పడిన గుంటలన్ని పాపపు చింతనలే ఊసిన ప్రదేశాలన్నీ గాయాల ఆనవాళ్లే సమూహాన్ని జతకట్టగల మహాపాదయాత్ర సడక్ బంద్ లో ఒంటరీదైనా దిక్కులేని వారికి రోడ్డు దిక్కై జోల పాడే తల్లి మనుషుల్ని కలిపే రోడ్ మీద పయనించే నాలుగు అక్షరాలు మనసు గమ్యం చేరుతాయి రోడ్ అంటే త్యాగాల పాదముద్రలు మోస్తున్న క్రీస్తు!
June 28, 2020 • T. VEDANTA SURY • Poem