ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
లాక్ డౌన్ లో నేర్చికున్న విద్యలు: - డా..కందేపి రాణీప్రసాద్.
October 27, 2020 • T. VEDANTA SURY • Memories

భారత దేశంలో మార్చి 22వ తేది నుంచి ఏప్రిల్ 14 వరకు తోలి విడత లాక్ డౌన్ విధించారు.అలా 5 విడతలుగా లాక్ డౌన్ మరల మరల పొడిగించబడింది.అయితే ఆ సమయం లో క్రాంతి శీలురైన రచయిత్రులు ఏం చేశారనే విషయం పై ఈ డైరీ రాయటం జరుగుతున్నది.మొదటి వారం రోజులు బయటకు వెళ్ళకుండా ఉండటం అనే విషయం పై మనసు లగ్నం చేయటం జరిగింది.అంతే కాకుండా పనివాళ్ళను మాన్పించి ఆ పనులు మనమే చేసుకోవటం,ఏ పని ముందు,ఏ పని వెనక చేసుకుంటే సమయం సరిపోతుందనేది చాలా కష్టమైన విషయంగా అనిపించింది.మొదట్లో టిఫిన్ల కోసం పప్పు నాన బోసు కోవడం మర్చిపోయి ఇబ్బంది పడ్డ సందర్భాలున్నా టిర్వాతర్వాత సమస్యలు ఎదురు కాకుండా దాటేయ గలిగాను.యూట్యూబ్ లో చూసి హెల్దీ వంటలు చేయడం మొదలు పెట్టాను.అంతకుముందు హొటల్లో అనే వన్నీ ఇంట్లో చేయగలగడంతో నేను వంట చెయగలననే ఆత్మ విశ్వాసం వచ్చింది.ఇది నేను సాడించిన తోలి నూతన విజయం.
                అన్ని మీడియాలలో కరోనా పాటలు వస్తుంటే నాక్కూడా పాడాలనిపించింది.ఎప్పుడో చిన్నపుడు పాడిన అలవాటును గుర్తు చేసుకోని కరోనా పాటలు పాడటం మొదలు పెట్టాను.అలా ఒక పది పాటలు పాడాను.అందరూ 'మీరు పాటలు కూడా పాడతారా' అని ఆశ్చర్యంగా అడిగారు.అంటే అద్భుతంగా పాడానని కాదు.ప్రయత్నించి సఫలం పొందాను.నాలుగైదు ఇంటర్వ్యూలలో కూడా పాడి వినిపించాను.కరోనా పాటలతో పాటు మాములు సినిమా పాటలు 60,70 దాకా నేర్చుకోని పాడి రికార్డు చేశాను.ఇది లాక్ డౌన్ సమయంలో కొత్తగా వెలికి తీసిన కళ.
             నేను సాహిత్య రచనయే కాకుండా చిత్రాలు కూడా వేస్తుంటాను.అదీ ఆసుపత్రి వ్యర్ధ పదార్ధాలతో 3000 బొమ్మలు చేసి "మిల్కి మ్యూజియం" ను నెలకొల్పాను.కాబట్టి మా ఆసుపత్రి వ్యర్థాలతో కరోనా చిత్రాలను చెయ్యాలనుకున్నాను.సుమారు 25 బొమ్మలు దాకా చెయ్యగలిగాను.ఆ బొమ్మలతో ఒక ఎగ్జిబిషన్ కూడా నిర్వహించాము.వీటిని కరోనా కవితల పుస్తకంలో పొందుపరిచాను.
             మా ఆసుపత్రి ద్వారా కరోనా వైరస్ గురించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాము.ఆహారం,పండ్లు,కూరగాయలు వంటివి అనేక సంస్థల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చాము.మా సృజన్ హాస్పిటల్ తరపున కరోనాకు దూరంగా ఉండేలా ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలనే విషయాలు యూట్యూబ్ ద్వార వీడియోలు చేసి పెట్టాము.తెలంగాణ ప్రభుత్వానికి వలస కూలీలను ఆదుకొవటాని కోరకు లక్ష రూపాయల డోనేషన్ ను అందించాము.
              కరోనా కవితలు రాశాను అందరు కవుల్లానే వాటిని ఒక్క పుస్తకంగా తీసుకొచ్చాను.ఇందులో కథలు,కవితలు,వ్యాసాలు,చిత్రాలు,మినీకవితలు ఉన్నాయి.దీనికి 'క్వారంటైన్' అనే పేరు పెట్టాను.లాక్ డౌన్ సమయంలో అనేక సంస్థలు ఆన్ లైన్ కవి సమ్మేళనాలు నిర్వహించారు.నేను వాటనింటి లో పాల్గోన్నాను.అదేమీ ప్రత్యేకం కాదు గానీ ఆన్ లైన్ ద్వార పాల్గొనడం మొదట్లో కష్టంగా అనిపించినా రాన్రాను అలవాటయింది.జూమ్ ద్వారా వర్చువల్ గా కవి సమ్మేళనాల్లో వెబ్ నార్లలో పాల్గొనడం లాక్ డౌన్ లో టెక్నాలజీ పరంగా నేర్చుకున్న కొత్త విద్య.
             పిల్లలు స్కూళ్ళు లేకుండా ఇళ్ళలోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళని అడించడానికి పాత అటల్ని పరిచయం చేస్తూ వ్యాసాలు రాశాను.దాదాపు గా 90-100 రకాల అటల్ని పిల్లలకు పరిచయం చేశాను.పిల్లలతో పాటు తల్లులు కూడా ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేయడానికి కొన్నీ కళాకృతులను వివరిస్తూ వ్యాసాలు రాశాను.ఏప్రిల్ నుంచి ఇప్పటి దాకా కాలమ్ గా వ్యాసాలు రాశాను.ఇందులో దాదాపు 200 కళాకృతుల్నీ తయారు చేసే విధానాన్ని వివరించాను.
              లాక్ డౌన్ సమయంలో మాములు రోజుల్లో కన్నా బిజీగా ఉండటం జరిగింది.వంటలు,ఆన్ లైన్ కవి సమ్మేళనాలు,సాహిత్య రచన,పాటలు పాడటం,కరోనా చిత్రాల తయారీ,కరోనా కవితలు పుస్తకం వేయడం,సామాజిక అవగాహనా కార్యక్రమాలు.దినసరి వేతనాల కూలీలకు ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలతో లాక్ డౌన్ సమయాన్ని విజయవంతంగా  ముగించాము