ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వందేమాతరం అంటే...:-- యామిజాల జగదీశ్
November 3, 2020 • T. VEDANTA SURY • Story

ఓమారు గాంధీజీ ఇంగ్లండ్ వెళ్ళినప్పుడు 
జరిగిన సంఘటన. 

ఓ ఇంగ్లీష్ ఉన్నతాధికారో లేక పాలకులలో ఒకరో గుర్తుకు రావడం లేదు. ఆయన గాంధీజీని తన ఇంటికి ఆహ్వానించారు. 

అయితే ఆయన గాంధీజీని హేళన చేయడంకోసం తన ఇంటి కుక్కను "వందేమాతరం కమాన్" అని పిలిచారు. 

వెంటనే ఆ కుక్క పరిగెట్టుకుంటూ వచ్చింది.

ఆ కుక్కను చూపుతూ "మిస్టర్ గాంధీ! మీరేంటో వందేమొతరం వందేమాతరం అంటుంటారు. మా ఇంటి కుక్క పేరు వందేమాతరం" అని హేళనగా నవ్వాడు.

అప్పుడు గాంధీజీ "వందేమాతరం అంటే మీకు అర్థం తెలీలేదేమో...వందేమాతరం అంటే అమ్మకు వందనం అని అర్థం. ఆ మాట ఎంతో పవిత్రమైనదీ. ఉన్నతమందీనూ. కానీ మీ తల్లి ఈ కుక్కేనా... " అని అనేప్పటికి ఆ ఇంగ్లీష్ వ్యక్తి సిగ్గుతో తలదించుకున్నాడు.