ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వందే కృష్ణం జగద్గురుమ్..!---సుజాత.పి.వి.ఎల్.
October 13, 2020 • T. VEDANTA SURY • Story

గోకులంలో ఒక మహిళ బావి దగ్గర నీళ్లు తోడుతోంది. కుండ నిండగానే ఎవరైనా ఆ కుండ తలమీద ఎత్తిపెడితారేమో అని అటు ఇటు చూసింది. అటుగా వెళుతున్న కృషుడు కనిపించలేదు. మాయమైపోయాడు. "కృష్ణా కృష్ణా " అని పిలిచింది . కృష్ణుడుకి వినిపించినా కూడా వినిపించనట్లు వెళ్లిపోయాడు.  "ఈయనకి ఏమైంది " అనుకుంటూ ఎలాగోలా కుండ ఎత్తుకుని ఇంటికి చేరుకుంది.
అక్కడ ఆమె కన్నా ముందు కృషుడు చేరుకుని ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. "రా ! కుండ దించిపెడతాను " అన్నాడు. ఆమె ఆశ్చర్యంతో అడిగింది " అప్పుడు పిలిస్తే రాకుండా ఇప్పుడు పిలవకుండా వచ్చి కుండ దించి పెడతాను అంటున్నావు.ఇందాక నా తలపై కుండ మీద కుండ పెట్టమని సాయం అడిగితే కూడాచేయలేదు.ఇప్పుడు అడగకుండానే సీయపడుతున్నావు..  నాకేమి అర్ధం కావట్లేదు కృష్ణా" అంది. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి " నేను భారం దించేవాడిని. భారం ఎక్కించడం నా పని కాదు ". అని వెళ్ళిపోయాడు.