ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వంశీ ఆర్ట్ థియేటర్స్ పెట్టకముందు------1968 లో నేను విద్యానగర్ లో ఉన్న స్వామి వివేకానంద రాత్రి కాలేజీలో చదివాను.పగలంతా లోకల్ ఫండ్ ఆడిట్‌ ఆఫీసు లో పనిచేసేవాడిని.పియూసినుంచి బియే వరకు అక్కడే చదివాను.రామదాసు నాటకం అయ్యదేవర పురుషోత్తమరావు గారు (వారు కూడా మాతోపాటు రాత్రి కాలేజీ లో చదువుకున్నారు)ప్రాద్రర్శిస్తుూ నన్ను రాముడు పాత్ర వేయన్నారు .తానీషాగా మా పొలిటికల్సైన్స్ లెక్చరర్ సుబ్రహ్మణ్యం గారు నేను రాముడుమాక్లాస్స్ మేటు రెడ్డి లక్ష్మణుడు గానువేశాము .ఆ ఫోటో ఇప్పుడు దొరికింది.50 ఏళ్ళ క్రితం ఫోటో ఇది.ఆ డ్రామాఖండవల్లి లక్ష్మిరంజనం గారు చూసారు.ఆ కాలేజీ వారే పెట్టారు.వారి తమ్ముడుబాలేందుశేఖరం గారు ప్రిన్సిపాల్.డ్రామా అయినతరువాత బాగా చేసావునువ్వు కాలేజీ ఫీజు కట్ట అవసరం లేదుఅన్నారు.చాలా సంతోషమేసింది.ఎందుకంటే 1968 లో నా జీతం 80రూపాయలు కాబట్టి.-వంశీ రామరాజు
August 3, 2020 • T. VEDANTA SURY • Memories