ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వడ్లు:-ఉండ్రాళ్ళ రాజేశం
October 11, 2020 • T. VEDANTA SURY • Poem

అన్న నాగలి దున్నాడు
అయ్య అలుకుడు చేశాడు
చెల్లి నారు తెచ్చింది
అవ్వ నాటు వేసింది
అందరం కలుపు తీశాము
పైరు పచ్చగ ఎదిగింది
పొట్టతో నిండుగా మారింది
పాల గింజలనిచ్చింది
గొలుసులు రమ్మని పిలిచాయి
కొడవలి జతలు కదిలాయి
మోపుల బంతి తిరిగింది
గడ్డివాము ఎత్తున నిలిచింది
ధాన్యం రాసి పెరిగింది
బస్తాల సంచులు తరలాయి
గిర్నిలో బియ్యం, తౌడుగా వీడింది
బియ్యం కాగుల చేరింది
అన్నం ముద్దలుగా కడుపు నింపింది
జనులకు బలం పంచింది