ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వర్కింగ్ డే --కె ఎస్ అనంతాచార్య-- లేచినప్పటి నుండి రికాం లేని ఆలోచనలు! కళ్ళు మూతలు పడేదాక శ్వాసని పనిని సమాంతర అశ్వాల పైన స్వారీ ఉరుకుల పరుగుల ఉద్యోగ జీవితాన్ని అల్లుకున్న ముళ్ల గులాబీ లేవగానే గదుల్లో చిందులు డైనింగ్ మీద జాగింగ్! షేరింగ్ ఆటో ట్రావెలింగ్ జామ్ అయితే.... బాసు చురకలు! తోల్ కే ఖానా అటుంచి లెక్కల మీద సంసారాన్ని ఆవిడతో గుణించుకొని ఆఫీసు తో భాగిస్తే నాకు మిగిలే సమయం శూన్య శేషం సీటుకు అతుక్కు పోయిన పగళ్లు ఫైళ్ల నెగళ్ళ మధ్య ఉప్పొంగే చెమట సముద్రాలు లంచ్ బాక్స్ తో బాక్సింగ్ ! డే నైట్ వర్క్! వర్క్ ఈస్ వర్షిప్ రిటర్న్ గిఫ్ట్ డయాబెటిక్! విరహావేదన ఉపశమనం కోసం మన సొక చకోరపక్షి! కంటి మీద కునుకు పంటికింద మసాలా దినుసు పాత సినిమా కాస్తా ఊరట ఆదివారం అనుబంధాల కదంబ మాల
August 19, 2020 • T. VEDANTA SURY • Poem