ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వర్షాల వలన జలుబు, దగ్గు, జ్వరం - నివారణ - వర్షాల వలన చల్లని వాతావరణం ఏర్పడి చలి గాలులు తట్టుకోలేక పోవడంతో జలుబు, జ్వరాలు విష జ్వరాలు వస్తుంటాయి. కొత్త నీటి వలన కాలేయం బలహీనమవుతుంది. పసుపు + తేనే మిశ్రమాన్ని ప్రతి రోజు గోరు వెచ్చని నీటితో తీసుకోవాలి. ఇలా ఏడు రోజులు తీసుకోవాలి. తిప్ప తీగ ఆకులు లేక కాండం ముక్క ను నలగ్గొట్టి కొన్ని లవంగాలు + దాల్చిన చెక్క ముక్కను నీటిలో వేసి కషాయంగా కాచి చల్లార్చి తేనే కలిపి తాగాలి. జలుబు, దగ్గు, జ్వరం , ప్రతి రోజు తాగితే తగ్గి పోతుంది. వొంటి నొప్పులు కూడా తగ్గి పోతాయి. కాలేయ వ్యాధులు రావు. నెలవేము + త్రిఫలా చూర్ణం +త్రికట చూర్ణం నీటిలో వేసి కాషాయం చేసి తేనెతో తాగాలి. జ్వరం తగ్గి పోతుంది. - పి . కమలాకర్ రావు
August 17, 2020 • T. VEDANTA SURY • health tips