ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వలస కార్మికులు : -పూసాల సత్యనారాయణహైదరాబాద్ , సెల్ నెంబర్ 9000792400
August 28, 2020 • T. VEDANTA SURY • News

దేశం నలుమూలల కమ్మిన కారు మేఘాలు వలస కార్మికులు. 
శ్రమ బిందు వులై వర్షించ డానికి వచ్చిన శ్రామికులు.ప్రగతి పల్లకి మోసే కూలీలు.
చెమటను పిండి ఆహారముగా మార్చుకునేయంత్రాలు. భవన నిర్మాణ పనుల్లో మరణమృదంగా లెన్నొనో.   అనారోగ్యంతో     అసువులు బాసిన వారెందరెందరో.                       పశువుల కొట్టా లిచ్చి పశువులను చేసి నోళ్ళు.  ఆహారం అందించక శ్రమను పితికే వాళ్ళు .            కార్మికుల రక్తాన్ని పీల్చుకుంటున్న  జలగలు పని తీసుకునే యజమానులు. 
చట్టానికి కళ్ళు లేవు .
సంక్షేమానికి జీవం లేదు.                   
కళ్లకు గంతలు కట్టుకున్న న్యాయం కడుపులు కాల్చింది.మూలుగు తున్న నక్కపై తాటి పండు పడ్డట్లు.  కరోనా సునామీకి చెల్లా చెదురుగా విసిరి వే యబ డ్డారు.పని లేక తిండి లేక నిలువ నీడలేక  క్షణమొక యుగంగా  చచ్చు తూ బతుకీడుస్తున్న  వారి బాదలు .అరణ్య రోదనాలు .నరకానికి చిరునామాలు.  విసిగి వేసారిన వారు కలోగంజో తాగి తమ ఊరిలో చస్తామని కాలి నడకకు నడుము బిగించారు.నెత్తిన మూట తో చంకన పాప తో నిప్పులు రాలుస్తున్న ఎండ లో బొబ్బలెక్కిన కాళ్ళ తో లాక్ డవున్   తొక్కి పడేస్తూ కదం తొక్కి నారు . రోడ్ల పై మరణాలు పురిటి నొప్పులతో ప్రసవాలు .హృదయ విదారక దృశ్యాలు .కష్టాలను ప్రతి బింబాలు.