ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వసుదేవుడు -పురాణకథ.--డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
November 22, 2020 • T. VEDANTA SURY • Story

వసుదేవుడు గతజన్మలో "సుతముడు"అనే ప్రజాపతి. శ్రీమహావిష్ణువు తనకు బిడ్డగాపుట్టాలిఅని తపస్సు చేసివరం పొందినవాడు.అందుకు తను అంధవంశంలోని "శూరసేనుడు"కిజన్మించాడు.అప్పుడుఆకాశంలోదుంధుభీలుమోగాయి.అందుకే అతనికి'అనకదుంధుభి'అనేపేరువచ్చింది.వసుదేవునికి,దేవభాగుడు,దేవాశ్రవుడు,అనకుడు,సృంజయుడు,శ్యామకుడు,కంకుడు,అనీకుడు,వత్సకుడు,వృకుడు,అనేతొమ్మిదిమందిసోదరులు,పృధ,శ్రుతసేన,శ్రుతకీర్తి,శ్రుతశ్రవ,రాజాధిదేవిఅనే        సోదరి మణులు ఉన్నారు.
శృతకీర్తిని కరూదేశాధీశుడైన 'వృధ్ధశర్మ'వివాహంచేసుకున్నాడు.వీరికి 'దంతవకృడు'జన్మించాడు.శృతదేవని కేకేయశ్వరుని వివాహం చేసుకుంది.శృతశ్రవ ఛేధిదేశుడుదమఘోషునివివాహంచేసుకొగావీరికి'శిశిపాలుడు'జన్మించాడు.ఈమెకు'సాత్వతి'అనేపేరుకూడాఉంది.పృధను తనమేనత్త కుమారుడైన కుంతిభోజునకు సంతతి లేనందున ఫృధను దత్తత ఇచ్చినందున ఆమెపేరుకుంతిఅయింది.కుంతి సూర్యునివరానకర్ణునికిజన్మనిచ్చి,అనంతరంపాండురాజునువివాహంచేసుకుని,ధర్మరాజు,భీముడు,అర్జుననకుజన్మనిచ్చింది.రాజాధిదేవిఅవంతీశ్వరునివివాహంచేసుకుని 'విందాన-విందుడు'లకు ,మిత్రవిందకు జన్మనిచ్చింది.ఈమిత్రవింద శ్రీకృష్ఞుని అష్టభార్యల్లో ఒకరు.
దేవకుడుఅనేరాజుకుదేవవలుడు,అనుపదేవుడు,సుదేవుడు,దేవవర్ణనుడు,అనేకుమారులతొపాటు,దేవకి,శాంతి,దేవ,దేవధృత,శ్రుతదేవి,మిత్రదేవి,శ్రీదేవి అనేకుమార్తేలు జన్మించారు.దేవకుడు తనకుమార్తేలు అందరిని వసుదేవునికి ఇచ్చివివాహంజరిపించాడు.వీరుకాకుండావసుదేవునికిరోహిణి,కంక,కౌసల్య,పౌరలి,మదిర,దేవరక్షిత వంటి పలువురు భార్యలుకలరు.
వీరిలోరోహిణీకిబలరాముడు,గదుడు,సారణుండు,విపులుడు,దుర్మదాదులు,సుభధ్రతొకలసి పన్నెండు మందిసంతతి కలిగారు.పౌరలికి సుభద్రుడు,మదిరకు సుందోపసుందులు,దేవరక్షితకు గదాదుడు,దేవకీకి కీర్తిమంతుడు,సుషేణుడు,భధ్రాసేనుడు,అష్టమగర్బాన శ్రీకృష్ణుడు జన్మించారు.