ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వానకు జై : -- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
November 8, 2020 • T. VEDANTA SURY • Poem

మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినయ్
మబ్బులమధ్యా మెరుపులొచ్చినయ్
మెరుపులతోనీ చినుకులొచ్చినయ్
హోరుగ వానలు కురువసాగినయ్
జోరుగ కాల్వలు పారసాగినయ్
పంటలు మెండుగ పండసాగినయ్
కరువులు పూర్తిగ వెళ్ళిపోయినయ్
ప్రజలకు సుఖములు కలుగజేసినయ్
అందుకె వానకు జై జై జై !!