ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వాన---అయిత అనిత-8985348424
November 1, 2020 • T. VEDANTA SURY • Poem

చిట్టిపొట్డి బాలలం
చిన్నారి బాలలం
వానంటే మాకిష్టం
వరదంటే మాకిష్టం

ఉరుములకు భయపడతాం
మెరుపులకు ఆనందిస్తాం
తొలకరి చినుకుల్లో
వల్లప్పా ఆడుతాం 

వరదల్లో సాగుతాం
మట్టితోనే కలిసిపోతాం
పడవలెన్నో చేసేస్తూ
కాలువల్లో వదులుతాం

చినుకుల్లో కేరింతలు కొడతాం
తలపై ఆకులు కప్పుకుంటాం
ఒళ్లంతా తడుపుకుని
హాచి హాచి అని తుమ్ముతాం