ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వాము లేక ఒమ మరికొన్ని ప్రయోజనాలు :- జలుబు , రొంప , ఎక్కువైనప్పుడు కొద్ది వామును పెనం పై వేయించి ఒక గుద్దలో కట్టి వాసన చూస్తుండాలి . జలుబు ముక్కు కారడం తగ్గి పోతుంది. దంత వ్యాధులలో వామును పొడిగా చేసి రాక్ సాల్ట్ కలిపి పళ్ళు తోముకుంటే దంత వ్యాధులు తగ్గి పోతాయి తలలో పేలు పోవాలంటే వాము పొడిలో పటిక పొడి కలిపి పెరుగు లేక మజ్జిగ లో వేసి తలకు పట్టించి కొంత సేపటి కి స్నానం చేయాలి. .పేలు రాలి పోతాయి. కడుపులో నొప్పి లేచినపుడు , వాము పొడిలో కొద్దీ రాక్ సాల్ట్ , కరక్కాయ పొడి, శొంఠి పొడి కలిపి గోరు వెచ్చని నీటిలో వేసి తాగితే కడుపు నొప్పి తగ్గి పోతుంది. అతి మూత్రం వ్యాధి వున్నా వారికి బెల్లం ఉండలో వాము పొడి వేసి మింగితే అతి మూత్రం వ్యాధి తగ్గి పోతుంది. చిన్న పిల్లల్లో పక్కన మూత్రం పోయే వారికి వాము కాషాయం తాగించాలి- పి . కమలాకర్ రావు
August 8, 2020 • T. VEDANTA SURY • health tips