ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వాము లేదా ఒమ ఔషధ గుణాలు -1. వామును భారత దేశం లో అనాది కాలం నుంచి మంచి ఔషధంగా వాడుతున్నారు ముఖ్యంగా స్త్రీలకు ప్రసవించిన తరువాత గర్భాశయానికి సంబంధించిన విపరీతమైన నొప్పులను తగ్గించడానికి ఇతర సూక్ష్మ జీవుల ద్వారా వ్యాధులు రాకుండా ఉండటానికి దివ్య ఔషధం.. ఇది మంచి జీర్ణకారి మనం తినే అన్ని రకాల పప్పు దినుసులను తేలికగా ఆరగించే సామర్థ్యం ఒక్క వాము తోనే సాధ్యం . పాలు లేక పాల ఉత్పత్తులు తిన్న తరువాత అజీర్తి వస్తే వామును కొద్దిగా వేయించి పొడి చేసి తింటే వెంటనే తిరిగిపోతుంది. కడుపులో నొప్పి వచ్చినా వాము పొడిని గోరు వెచ్చని నీటిలో వేసి తాగితే తగ్గుతుంది. శరీరంలో ఎక్కడైనా వాపులు వచ్చినా వామును వాడితే తగ్గి పోతుంది. -పి . కమలాకర్ రావు
August 7, 2020 • T. VEDANTA SURY • health tips