ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వాలి-సుగ్రీవుడు.(పురాణపాత్ర) డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
November 20, 2020 • T. VEDANTA SURY • Story
బ్రహ్మదేవుడు సృష్టించిన ఋక్షవిరజుడు అనే వానరుడు మేరు పర్వతంపై సంచరిస్తూ అక్కడి కొలనులో దిగగానే, అందమైన స్త్రీరూపం పొందింది."ఏపురుషుడు అయినా ఈకొలనులో దిగితే స్త్రీ గా మారిపోతారు"అని పార్వతిదేవి శాపం ఆకొలనుకు ఉంది. అలా ఋక్షవిరజుడు స్త్రీగా మారడంతో మోహించిన ఇంద్రుడు ఓబిడ్డను ప్రసాదించాడు.అతడేవాలి.అనంతరం సూర్యదేవుని వరంవలన సుగ్రీవుడు జన్మించాడు.ఇద్దరు మహాపరాక్రమవంతులుగా పేరు పొందారు.
ఇంద్రుడు వాలికి హేమమాలికను ఇచ్చాడు. పోరాడుతున్నప్పుడు వాలి ఆమాలధరించేవాడు . అప్పుడు తన ప్రత్యర్ధి బలంలోని సగబలం ఆమాల వలన వాలికి లభించేది.వాలిభార్యతార.వీరి పుత్రుడు మహాబలశాలి అయిన అంగదుడువాలి రావణుని గర్వం అణచినవాడు.ఒక సారి 'దుంధుబి'అనేరాక్షసునివధించి వాడికళేబరాన్ని పర్వతపంక్తులపైకివిసిరాడు వాలి.అక్కడ రుష్యమూక పర్వతంపై ఆశ్రమంలో నివసిస్తున్న మాతంగముని పై దుంధుభి రక్తమరకలు పడతాయి. కోపించిన మాతంగముని "ఈనుచకార్యం చేసినవాడు ఈపర్వతం పైకి వస్తేమరణిస్తాడు" అనిశపించాడు.వాలితో సుగ్రీవునికి విరోధంవచ్చాక రుష్యమూక పర్వతంపై,తన అనునయులైన హనుమంతాది,వానరవీరులతో నివసించసాగాడు, రామునితో స్నేహంకుదుర్చుకున్న సుగ్రీవుడు రాముని చెట్టుచాటుగా ఉండి వాలి ని తన శరంతో సంహరిస్తాడు. వాలికి ఎదుటపడి ఎవరూ జయించలేరు కనుక శ్రీరాముడు అలాచేసాడు. అనంతరం సుగ్రీవుని కిష్కిందకు రాజునుచేసి, అంగదునికి యువరాజు పట్టాభిషేకం చేసి, వానరవీరుల లో హనుమంతుని ద్వారా సీతదేవి జాడ కనుగొని,రావణ సంహారంచేసాడు శ్రీరాముడు.