ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
విజయరహాస్యం --కె ఎస్ అనంతాచార్య
September 29, 2020 • T. VEDANTA SURY • Poem

సాధించిన దానితో సంతృప్తిని పొంది
విజయమనుకొని  
జారిపోయే భావాలను ఒడిసిపట్టి వ్యక్తీకరించే చిక్కటి ఆలోచన 
కార్యసాధన అంటే గొప్ప పనులు చేయడం కాదు
  అభిరుచిని ఆకాశమెత్తు  నిలబెట్టి
 పొందే  పలితం!

విత్తును నాటి మొక్కను పెంచడం కాదు చీడపీడల్ని బాపి
పసిడి  పంటను తీసే
 కృషి కళా మర్మజ్ఞత

దాగిన నైపుణ్యాల వెలికితీసి వేలాది మందితో పోరాడి గెలిపించే ద్రోణ సంకల్పం

పోరాటం నీ జన్యు వులో ఎగబాకితే విజయం నే పాదాక్రాంత మవుతుంది !

ఏది నిన్ను వెతుకుతూ
ఊరికే రాదు వెంటబడి 
వేటాడి సాధించే సాఫల్యత 

సామాన్యుడిని అసమాన్యుడిగా తీర్చిదిద్ది నిలబెట్టే నిండైన వజ్ర సంకల్పం

నీతి నిన్ను వరించి
నిజాయితీ ఆవరించినప్పుడు విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది