ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
విజయానికి మెట్లు--కె ఎస్ అనంతాచార్య-- శ్రమ ఆయుధంతో బయలుదేరితే శతాధిక యత్నాలకు ఒకే విజయం పగటి విచారణల మీద రాత్రి సెగళ్ళ నెగళ్ల మీద నుండి సాగే సాధనాదీక్ష ఆదర్శాలన్నింటిని ఆరాధించడం కాదు ఎత్తుపల్లాల దారి మీద ఎదురుగాలియై విజృభించడమే కోరికలు గ్రందులలోనుంచి స్రావకమై స్రవించడం కాదు పొందడం కోసం చేసే పోరు గుడ్డిగా ముందుకెళ్లి దెబ్బతినడం కాదు నీటిమీద నడిచే నమ్మకం సాధించడం ఆకాశానికి నిచ్చెన వేసి మబ్బుల్లోని సూర్యుడిని వెలికి తీసి వెలుతురు పంచడం విశ్వజనీనమైన విశ్వాసం విధిరాతను తుడిపే విధాతలా నిలబడటo రహస్యాలను బేధించే రణ శాస్త్ర విషయాలను ప్రస్తారణ చేయగలగడం పాము చెవులతో పక్షి కళ్ళతో పులి చూపుతో సెకండ్ల ముల్లు మీద సేదతీరని పయనం పాకుడు రాళ్లమీద పదిలంగా పరుగెత్తిన పుడే విజయం ఎదురు నిలుస్తుంది
August 16, 2020 • T. VEDANTA SURY • Poem