ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
విజేత!!: --కె ఎస్ అనంతాచార్య
August 28, 2020 • T. VEDANTA SURY • Poem

ట్టి, పొడవు
రంగు,రూపు
వైకల్యాలు అడ్డుకావు
విజయం ముంగిట
 ప్రపంచాన్ని నిలపటానికి
నడచిన దారి కాదు
 కొత్త రహదారి నిర్మించే
 గోల్ ఒక్కటే
సోల్ నిండాలి
అలెగ్జాండర్ అబ్దుల్ కలామ్
ఆది శంకరులు రామానుజులు 
నీలా నాలా పుట్టిన వారే
కానీ ను వ్వో నేనో 
వినమ్రుల యే జేతలు వారు 
 రగిలే కోరికకు
స్వయం ప్రేరణతోడైతే
రైఫీల్ గురి తప్పదు
పట్టుదల గట్టిదైతే
చర్మం గీసుకు పోయి
రక్త మోడినా 
రగిలే కాంక్షకు శిఖరం శిరసు
వంచి నిలబడుతుంది!
విశ్వవిజేత కు
సంస్కారం తోడైతే
ప్రపంచమే పాదాక్రాంతం
రంగుల కల ల్ని
కళ్ళకు అద్దుకొని
లక్ష్యము వైపు సంధిస్తే
 అడవి నీ అడుగులకు
మడుగులు ఒత్తుతుంది
విజేత నొక్కసారి దర్శిస్తేచాలు
విజయ ప్రకంపనలు
విజయపరంపరలు
మొదలవుతాయి
విజేతలెప్పుడూ
సాధారణ జనo నుంచే పుడతారు
అసాధారణ
అద్భుతాలు పుట్టిస్తారు