ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
విజ్ఞానo -సార్థకత..!'--సుజాత.పి.వి.ఎల్.--విజ్ఞానం లేని విద్య, వివేకం లేని విజ్ఞానం, లౌకికం లేని మనిషి, విచక్షణ లేనిపని, విజ్ఞత లేని పాండిత్యం, అర్హత లేని అధికారం, సత్యం లేని వాక్కు, మాధుర్యం లేని సంగీతం, భక్తి లేని పూజ, శీలం లేని మనిషి, వినయం లేని విద్యార్ధి, సభికులను మెప్పించలేని ఉపన్యాసం రాణించటం అసంభవం. శ్రమ తప్ప ఫలితం శూన్యం.శాస్త్ర జన్య జ్ఞానంతో పాటు ప్రతి ఒక్కరూ అనుభవ జ్ఞానమును సంపాదించి తీరాలి. అనుభవంలోకి రాని విద్యా విజ్ఞానాదుల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. మనలో నిలకడగా ఉన్న విజ్ఞానం వృధా అది వట్టి పాండిత్యం గా నిలిచిపోతుందే తప్ప ఎటువంటి ఉపయోగము గొప్పతనము ఉండదు. అట్లానే పలు పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించినంత మాత్రానా ఏం లాభం? దానిని అనుభవంలోకి తెచ్చుకొని లోక కళ్యాణానికి వినియోగించినప్పుడే విజ్ఞానానికి నిజమైన సార్థకత.!
July 23, 2020 • T. VEDANTA SURY • Story