ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం విద్యా విధానం -2020 పేరిట శ్రీకారం చుట్టింది. కస్తూరి రంగ కమిటీ నివేదిక ఆధారంగా ఈ విధానానికి రూప కల్పన చేసారు. ఇందులో భాగంగా మార్కులకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ. నైపుణ్యత, అవగాహన, వికాసాలకు పెద్ద పీట వేస్తూ ఈ విద్యా విధానాన్ని రూపొందించారు. దీనిలో భాగంగా 5+3+3+4విధానంగా నిర్ణయించారు.. అంతే కాకుండా 1 నుంచి 5వ తరగతి వరకు మాతృ భాషలోనే విద్యా బోధనా చేయాలనీ సూచించింది. జపాన్, చైనా , కొరియా, జెర్మనీ వంటి దేశాలు బోధనా భాషగా మాతృ భాషను ప్రవేశ పెట్టి విద్యా విధానం లో ప్రగతి సాధించాయి. ఈ నేపధ్యంలో మన దేశం లో కూడా నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. -మధు కుందూరు
July 30, 2020 • T. VEDANTA SURY • News