ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వివిధ దేశాల్లో వినాయక రూపాలు..!---సుజాత.పి.వి.ఎల్.
August 22, 2020 • T. VEDANTA SURY • News

వివిధ దేశాల్లో వివిధ రూపాలుగా వినాయకుడిని పూజిస్తారు. ప్రపంచంలోని హిందూదేశంగా పిలువబడే నేపాల్ లో సూర్యగణపతిగా, బాల్ దీవుల్లో అగ్నిదేవుడిగా, వియత్నాంలో లయకార గణపతిగా, ఇరాన్ లో సేనానాయకుడిగా, అలిధారుణ పేరుతో ఆరాధింపబడే గణేశుడు ఆఫ్ఘనిస్థాన్ లో కాబూల్ ప్రజల ఇంటింటి దైవంగా ఆరాధింపబడుతున్నాడు. ఈ విగ్రహం దాదాపు ఆరవ శతాబ్ధానికి ముందే ఉన్నట్లుగా పరిశోధకులు తెలియజేసారు. గ్రీసు దేశంలో జనస్ పేరిట పిలవబడే గణేశుడు ఏ కార్యారంభంలోనైనా తొలుత ఆరాధింపబడుతుండేవాడు. జనస్ దైవం ఏడు ఏనుగుల తలలతో రెండు తొండాలతో దర్శనమిస్తాడు. మెక్సికన్ సిటీలో ఇప్పటికీ వినాయకారాధన గమనించదగినది. ఇలా దేశవిదేశాలలో విఘ్నరాయుని పూజ నిర్విఘ్నంగా కొనసాగుతూనేవుంది.