ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
విశ్వవ్యాప్తి పొందుతున్న తెలుగు భాష, సంస్కృతి-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
August 31, 2020 • T. VEDANTA SURY • News

తెలుగుభాష, సంస్కృతి నేడు రాష్ట్ర, దేశ   సరిహద్దులు దాటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళ అందరి మధ్య సమైక్యతను పెంచిందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. దక్షిణాఫ్రికా తెలుగు కమ్యూనిటీ వారు ప్రపంచంలోని వివిధ తెలుగు సంఘాల తో కలిసి శనివారం నిర్వహించిన అంతర్జాల అంతర్జాతీయ తెలుగు సదస్సులో 'తెలుగు భాష -సంస్కృతి అనే సమావేశంలో  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రసంగించారు.
నేడు తెలుగువారు ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి చెందిన వారు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారని వీరంతా ఎక్కడున్నా తమ  తెలుగు మాతృభాషలోని సౌందర్యాన్ని, గొప్పతనాన్ని, ఆత్మీయతను కాపాడుకోవడం ఎంతో సంతోషించదగిన విషయమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచీకరణ ఫలితంగా ఆహార విషయాలలో వచ్చిన అనేకమైన మార్పులను వాటి దుష్ఫలితాలను గమనించి తెలుగు వారు తమ ఆహార పదార్థాలను నేడు బాగా ఇష్టపడుతున్నారని వివిధ పండుగల సమయాల్లో మాత్రమే కాకుండా మామూలు రోజుల్లో కూడా వాటిని తినడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రపంచీకరణ వలన కొన్ని దుష్పరిణామాలు ఉన్నప్పటికీ ప్రపంచీకరణ లో ఉన్న అనుకూల అంశాలను సానుకూలంగా మార్చుకోగలిగితే స్థానికతను విశ్వజనీనం చేయవచ్చునని ఆయన సూచించారు. ప్రస్తుతం ఇంటర్నెట్ అందుబాటులో ఉండి మీడియా ద్వారా సంస్కృతిని ప్రపంచానికి బాగా అందించే అవకాశం ఉందనీ, అందువలన తెలుగు సంస్కృతిని తెలుగు వాళ్లు విశ్వవ్యాప్తం చేయడానికి ఇదొక చక్కని మార్గంగా మలచుకోవాలని ఆయన సూచించారు. తెలుగు సంస్కృతిలో పండగలలో కనిపించే సామరస్య భావం సాత్వికాహారం, దాని వలన వచ్చే ఫలితాలు తెలిసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంస్కృతి దాని ఔన్నత్యం గుర్తించుకో గలుగుతారని దాన్ని తెలియదు చెప్పవలసిన బాధ్యత తెలుగు వాళ్ళ పై ఉందని ఆయన వ్యాఖ్యానించారు.  భారతీయులంతా చేసుకునే కొన్ని పండుగలను కూడా తెలుగు వాళ్ళు తమ పండుగలుగా చేసుకోవడంలో జాతీయ సమైక్యత సమగ్రత భావాలు ప్రతిఫలిస్తున్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు పండితులు లో ఉన్నటువంటి శాస్త్రీయతను ఆయన సోదాహరణంగా వివరించారు తెలంగాణలో జరుపుకొనే బతుకమ్మ పండుగ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటున్నారని ఆయన వెల్లడించారు. బతుకమ్మ పండుగ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లో కూడా జరుపుకోవడం ఆ పండుగ లో ఉన్నటువంటి విశేషమని ఆయన పేర్కొన్నారు. ప్రతి పండుగకు ఒక పురాణకథలు జోడించడం కొన్ని ఆచారాలు సంప్రదాయాలు సూచించడం అవి పండిత పామర జనుల అంతా పాటిస్తే శారీరక మానసిక ఆరోగ్యం టీచర్ ఫలితాలను పొందవచ్చునని పండుగలలో ఎటువంటి శాస్త్రీయ విషయాలను నిక్షిప్తం చేశారని ఆయన వివరించారు. అట్లతద్ది, నాగుల చవితి, ఉగాది, బతుకమ్మ, దేవీ నవరాత్రులు, దసరా దీపావళి, సుబ్రహ్మణ్య షష్టి మొదలైన పండుగలు తెలుగువాళ్ళు ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రద్ధతో చేసుకుంటూ సత్సంకల్పంతో జీవించటానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఈ సంకల్పం అనేది పాము ఎంత సుఖ సంతోషాలతో ఉండాలని అనుకుంటారు వారు తమ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అంతా కూడా అలాగే సుఖసంతోషాలతో జీవించాలి అని అనుకోవడమే నిజమైన ఎటువంటి సత్సంకల్పం అని ఆయన చెప్పారు. అలాంటి సత్సంకల్పం ప్రతి మనిషిలోనూ కలగాలి అంటే మనిషికి దైవ భావన ఉండాలని తమను ఒక అతీతమైన శక్తి గమనిస్తుంది ఆలోచన ప్రతి వ్యక్తిలోనూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి తప్పు చేయకుండా, దుర్మార్గంగా వ్యవహరించకుండా, అన్యాయానికి పాల్పడకుండా ఉంటారని, అవన్నీ పండగల సందర్భంగా వివిధ ఆచారాలు, సంప్రదాయాలు పురాణేతిహాస కథల ద్వారా తెలుస్తాయని ఆయన వివరించారు. ఈ సదస్సులో తెలంగాణ భాష గురించి తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ వివరించారు. తరతరాల తెలుగు సంస్కృతి వైభవాన్ని ఆంధ్ర ప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.విజయ్ కుమార్ వివరించారు. జర్మనీలోని హెడెన్ బర్గ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్  డాక్టర్ శ్రీ గణేష్ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు.  శ్రీమతి శ్రుతి అధ్యక్షత వహించారు. ఈ ఈ సదస్సులో దక్షిణ ఆఫ్రికా తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ విక్రమ్ పెట్టూరు.  కార్య నిర్వాహక సభ్యులు లక్ష్మణ్ వెన్నపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.