ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వృక్షమాత పూజ చేయాలి : --కిలపర్తి దాలినాయుడు
November 11, 2020 • T. VEDANTA SURY • Poem

క్షేమంగా ఉండే చెట్టును
మొదలంటా నరికావు
భవనాలు ఎన్నినాటినా
మొక్కలకవి సరికావు
అభివృద్ధిగ చంకలుగుద్ది
అదిరినట్టు అరిచావు!
వెనుకనుండి కాలుష్యం
కోరుతుంది నీచావు!
మొక్కలేని జీవితమెక్కడ
మొలవదు ఈ భూగోళంలో
చెట్టులేని ప్రపంచమెక్కడ
నిలుస్తుంద ఏ వ్యోమంలో ?
గొప్పగొప్ప నాగరికతలకు
గుప్పెడన్ని విత్తులు నిచ్చే
వృక్షమాత పూజసేయరా
రక్షణగా నీకు నిలచురా!